సమస్యలు చర్చకు రాకపోవడంపై మండిపడిన ఎంపి మోదుగుల
న్యూఢిల్లీ, డిసెంబరు 2, ప్రభాతవార్త: లోక్‌సభ, రాజ్యసభల్లో చర్చించాల్సిన అంశాలు ఎన్నో ఉన్నప్పటికీ వాటి జోలికి పోకుండా, సొంత ఎజెండాలతో పార్టీలు ఉభయ సభలు పలుమార్లు వాయిదాలు పడేలా గందరగోళ పరిస్థితి సృష్టించడాన్ని నర్సరావుపేట టిడిపి లోక్‌సభ సభ్యుడు మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి నిరసించారు. శుక్రవారం లోక్‌సభ ప్రారంభమైన వెంటనే వాయిదా పడటం, తిరిగి మద్యాహ్నం 12 గంట లకు సభను తిరిగి నిర్వహించడానికి ప్రయత్నించగా కాంగ్రెస్, బిజెపిల మొండి పట్టుతో వాయిదా పడటంతో మోదుగుల అందోళన వ్యక్తం చేశారు. ఉభయ సభల్లో సభ్యుల నియోజకవర్గాల్లో పేరుకు పోయిన సమస్యల్ని కేంద్రం దృష్టికి తేవడానికి ఎన్నోసార్లు ప్రయత్నించినప్పటికీ వాటిని సభలో ప్రస్తావించడానికి కనీసపు అవకాశం లభించడం లేదని అవేదన వ్యక్తం చేశారు.
లోక్‌సభ నిర్వహణకు రోజుకు సుమారు 60 లక్షల చొప్పుప ఖర్చు అవుతోందని, ఉభయ సభలు ప్రారంభ మైనప్పటి నుండి ఇప్పటి వరకూ సుమారు 8 కోట్ల రూపాయలు వృధా అయ్యా యన్నారు. అంతేకాకుండా రాZషంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను సభ దృష్టికి తేవడానికి తాను చేస్తున్న ప్రయత్నాలు పూర్తిగా విఫలం కావడం తనను బాధిస్తోందన్నారు. ప్రస్తుత సమయంలో దేశంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల అంశంపై సుదీర్ఘంగా చర్చించాల్సిన అవసరం ఉందని మోదుగుల అభిప్రాయపడ్డారు.
ఎంపిలకు 'ఎర్ర బుగ్గ' కార్లు ఇవ్వాలి : రాZషంలోని పార్లమెంట్ సభ్యులకు 'ఎర్రబుగ్గ' (రెడ్‌లైట్) కార్లను అనుమతించాలని లోక్‌సభ సభ్యుడు మోదుగుల డిమాండ్ చేశారు. ఇప్పటికే కర్ణాటక రాZష ప్రభుత్వం అ రాZష ఎంపిలకు రెడ్‌లైట్ కార్లను అందిస్తోందని గుర్తు చేశారు. అంతకు ముందు ఖయన లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో దేశంలోని బ్లడ్ బ్యాంకుల ఆధునీకరణకు అవస రమైన సాంకేతిక, ఆర్థిక సహాయసహకారాలపై ప్రశ్నించారు. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి గులాంనబీ ఖజాద్ ఇందు జవాబు ఇవ్వాల్సి ఉండగా, సభ పలుమార్లు వాయిదా పడటంతో మోదుగుల ఆవేదన వ్యక్తం చేశారు.

0 comments:
Post a Comment