Tuesday

అర్థరహితం భగవద్గీతపై కేసును ఖండించిన పార్లమెంట్ రష్యా దృష్టికి తీసుకెళ్లాం: కేంద్రం


భగవద్గీతను నిషేధించాలంటూ రష్యాలో నమోదైన కేసును కేంద్రం తీ వ్రంగా పరిగణించింది. భగవద్గీతపై ఫిర్యాదు పూర్తి గా అర్థరహితమని వ్యాఖ్యానించింది. ఈ అంశా న్ని సీనియర్ రష్యన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ట్లు విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. ఎం. కృష్ణ లోక్‌సభ లో తెలిపారు. భారత ప్రభుత్వం దీనిపై దృష్టిసారించిందని, మాస్కోలోని భారత రాయబార కార్యాల యం ఈ కేసును క్షుణ్ణంగా పరిశీలిస్తోందని ఆయన చెప్పారు. ఎవరో ప్రేరేపిత వ్యక్తులు కావాలనే ఈ అ నుచిత ఫిర్యాదు చేశారన్నారు. 

భారత నాగరికతకు భగవద్గీత ఆత్మలాంటిదన్నారు. రష్యాలో పనిచేస్తు న్న ఇస్కాన్ కేంద్రానికి సైబీరియాలోని టోమ్స్క్ ప్రాంతంలో ఉన్న కోర్టు నుంచి గత జూన్‌లో నోటీసులు అందాయని కృష్ణ వెల్లడించారు. మంత్రి ప్రకటన తర్వాత ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్ మాట్లాడుతూ 'గీత'ను జాతీయ గ్రంథంగా ప్రకటించాలని, అప్పుడు ఇతర దేశాలేవీ దాన్ని అవమానపరిచేందు కు ధైర్యం చేయలేవన్నారు. కాగా భగవద్గీతను అవమానపరుస్తూ రష్యాలో నమోదైన ఫిర్యాదును రాజ్యసభ ముక్తకంఠంతో ఖండించింది. 

ప్రధాన పక్షా లు కాంగ్రెస్, బీజేపీ సహా అన్ని పార్టీలు దీనిపై విచా రం వ్యక్తంచేశాయి. జీరో అవర్‌లో బీజేపీ సభ్యుడు తరుణ్ విజయ్ ఈ అంశాన్ని లేవనెత్తారు. సూర్యు డు, హిమాలయాలతో భగవద్గీత సమానమని, ఎవరైనా సూర్యుణ్ని, హిమాలయాలను నిషేధించగల రా? అని ప్రశ్నించారు. ఈ అంశంపై రష్యన్ ప్రభుత్వంతో కేంద్రం చర్చించాలని ఆయన డిమాండ్ చే శారు. 

ఈ అంశంపై పార్లమెంటులో తీర్మానం చేసి రష్యన్ ప్రభుత్వానికి పంపించాలని బీజేపీ సభ్యుడు అహ్లూవాలియా సూచించారు. ఈ అంశాన్ని ఇప్ప టికే రష్యా దృష్టికి తీసుకెళ్లినట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రాజీవ్ శుక్లా చెప్పా రు. కాగా ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామ ని మాస్కోలోని భారత రాయబారి అజయ్ మల్హో త్రా తెలిపారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ఉన్నతస్థాయి అధికారులను కోరినట్లు చెప్పారు. 

సంఘం ఏర్పాటును విరమించుకున్న ఇస్కాన్
సైబీరియాలోని టోమ్స్క్ ప్రాంతంలోని ఓ గ్రామంలో ఇస్కాన్ కమ్యూనిటీని ఏర్పాటుచేయాలని ఆ సంస్థ నిర్ణయించడమే ఈ వివాదానికి కారణంగా తెలుస్తోంది. దీన్ని స్థానికంగా ఉన్న ఓ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ క్రమంలోనే ఇస్కాన్ వ్యవస్థాపకులు భక్తివేదాంత స్వామి ప్రభుపాద అనువాదం చేసిన భగవద్గీత ప్రచురణకు వ్యతిరేకంగా ఇక్కడి చర్చికి అనుబంధంగా ఉన్న కొందరు వ్యక్తులు ఈ ఫిర్యాదు చేశారు.

0 comments:

Post a Comment