Tuesday

'ఆస్కార్' అర్హత జాబితాలో 'డ్యామ్ 999'


తమిళనాడులో నిషేధానికి గురైన చిత్రం 'డ్యామ్ 999' ఈ ఏడాది ఆస్కార్ అవార్డుల అర్హత జాబితాలో స్థానం సంపాదించింది. కేరళీయు డు సోహన్‌రాయ్ తొలిసారి నిర్మించిన ఈ సినిమా ఉత్తమ చిత్రాల విభాగంలో ఎంపికైన 265 చిత్రాలలో ఒకటి కావడం గమనార్హం. కాగా, సంగీత విభాగంలో ఎంపికైన 39 పాటలలో ఈ చిత్రంలోని మూడు గీతాలు కూడా ఉండటం విశేషం. ఈ మేరకు అకాడ మీ జాబితాలను విడుదల చేసింది. దీనిపై సోహన్ ఉబ్బితబ్బిబ్బవుతూ- తన కలల ప్రా జెక్టు, అందునా అరంగేట్ర సినిమా అయిన 'డ్యామ్ 999'కు ఇలాంటి అరుదైన గౌరవం లభించడం ఓ ఘనతగా అభివర్ణించారు.

0 comments:

Post a Comment