Sunday

కేంద్ర మంత్రివర్గంలో పెరియార్ ముల్లు డ్యామ్ భద్రతపై కేరళ సందేహాలు సరైనవి కావు కేంద్ర హోం మంత్రి చిదంబరం వ్యాఖ్య చిదంబరంపై కేర ళ నేతల నిప్పులు కేబినేట్ నుంచి తొలగించాలి...


కేరళ, తమిళనాడు ప్రజలు, నేతల మధ్య విద్వేషాలకు కారణమైన ముళ్లైపెరియార్ డ్యామ్ అంశం ఇప్పడు కేంద్ర కేబినెట్‌లోనూ చి చ్చుపెట్టింది. ఈ అంశంపై శనివారం చెన్నైలో వివాదాస్ప ద వ్యాఖ్యలు చేసిన హోం మంత్రి పి.చిదంబరంపై.. ప్రవాస భారతీయుల శాఖ మంత్రి వాయలార్ రవి ఆదివారం ఘాటైన విమర్శలు చేశారు. మరో మంత్రి కె.సి.వేణుగోపాల్ కూడా చిదంబరంపై మండిపడ్డారు.

శనివా రం చెన్నైలో కాంగ్రెస్ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించిన చిదంబరం.. "ముళ్లై పెరియార్ ఆనకట్ట భద్రతపై కేరళ వ్యక్తం చేస్తున్న సందేహాలు సరైనవి కావు. కేరళలో ఉప ఎన్నికల నేపథ్యంలో.. ఈ అంశాన్ని తెరపైకి తెస్తున్నా రు'' అని పేర్కొన్నారు. కేరళలోని ఎర్నాకుళం జిల్లా పిర వోం అసెంబ్లీ స్థానానికి త్వరలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. కాగా.. చిదంబరం ఇలా మాట్లాడిన తీరుపై కేర ళ ప్రజలు, నేతల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. 

ఈ నే పథ్యంలో.. కేరళ కాంగ్రెస్్‌లో సీనియర్ నేత అయిన వా యలార్ రవి కూడా చిదంబరంపై విరుచుకుపడ్డారు. "చి దంబరం అలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం. ఆయనలోని రాజకీయ అపరిపక్వతకు ఆ వ్యాఖ్యలు నిదర్శనం'' అంటూ ఆయన ధ్వజమెత్తారు. ఈ అంశం ప రంగా కేరళ, తమిళనాడు మధ్య శాంతి నెలకొనాలని ప్ర ధాని మన్మోహన్ పిలుపు ఇచ్చిన తరుణంలో.. ఆయన అభిప్రాయానికి విరుద్ధంగా చిదంబరం మాట్లాడటం త నను తీవ్రంగా నిరాశకు గురిచేసిందని అన్నారు. ఇక.. కేం ద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి వేణుగోపాల్ కూ డా హోంమంత్రి తీరును తప్పుపట్టారు. కేరళ మాజీ సీఎం అచ్యుతానందన్ చిదంబరంపై నిప్పులు చెరిగారు. కేబినెట్ నుంచి ఆయనను తొలగించాలని డిమాండ్ చేశారు.

నేనలా మాట్లాడాల్సింది కాదు: చిదంబరం
కాగా.. ముళ్లైపెరియార్‌పై తాను చేసిన వ్యాఖ్యల పట్ల కేరళలో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్న తరుణంలో.. త న వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు చిదంబరం ఆదివారం ప్రకటించారు. "కాంగ్రెస్ సమావేశంలో మా ట్లాడిన మిగతా వక్తలు లాగానే నేను కూడా (కేరళలో) రానున్న ఉప ఎన్నికల గురించి యథాలాపంగా ప్రస్తావించాను. ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాను.

నేను యథాలాపంగానైనా ఆ వ్యాఖ్యలను చేయకుండా ఉండాల్సింది. ఎవరి మనోభావాలనూ కించపరచాలన్నది నా ఉద్దేశం కాదు'' అని చిదంబరం వివరణ ఇచ్చారు. ఇకపోతే.. ముళ్లై పెరియార్ వివాదం నేపథ్యంలో.. తమిళనాడులో నివసిస్తున్న మలయాళీలపై జరుగుతున్న దా డులను అరికట్టాలని కోరుతూ కేరళ సీఎం ఊమెన్‌చాందీ తమిళనాడు సీఎం జయలలితకు ఒక లేఖ రాశారు.

0 comments:

Post a Comment