Monday

నాటో ట్యాకంర్లపై మళ్లీ దాడి డ్రైవర్ మృతి.. ఏడు ట్యాంకర్లు దహన


పాకిస్థాన్, అమెరికా మధ్య అగాధం మరింత తీవ్రమవుతోంది. నిన్న మొ న్నటి వరకు రాసుకు పూసుకు తిరిగిన రెండు దేశాల మ ధ్య పరస్పర విశ్వాసం రోజురోజుకు క్షీణిస్తోంది. పాకిస్థా న్ సరిహద్దు శిబిరంపై నాటో దాడి చేయడం.. 24 మం ది పాకిస్థాన్ సైనికులు మరణించడం తెలిసిందే. దీనిపై పాక్ తీవ్రంగా మండిపడితే.. ఆ ఘటనను దురదృష్టకరమైనదిగా నాటో అభివర్ణించింది. ఆ దాడి ప్రకంపనలు అమెరికాను కుదిపేస్తున్నాయి.

తాజాగా, నైరుతి పాకిస్థాన్‌లో నాటో ఆయిల్ ట్యాంకర్లపై ఆదివారం అర్ధరాత్రి సా యుధ దుండగులు దాడి చేశారు. ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో ట్యాంకర్ డ్రైవర్ మరణించగా.. ఏడు ట్యాంకర్లు దహనమయ్యాయి. కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే నాటో ట్యాంకర్లపై దాడి జరగడం ఇది రెం డోసారి కావడం విశేషం. అయితే, దీనికి తమదే బాధ్యత అంటూ ఇప్పటి వరకూ ఎవరూ ప్రకటించుకోలేదు. "ఎ నిమిదిమంది సాయుధులు మోటారు సైకిళ్లపై ట్యాంకర్ల కాన్వాయ్ దగ్గరకు వచ్చి, ఆపి కాల్పులు ప్రారంభించా రు.

దీంతో ఓ ట్యాంకర్ డ్రైవర్ అక్కడికక్కడే మరణించాడు. ఆ తర్వాత ట్యాంకర్లకు నిప్పు పెట్టి దుండగులు పరారయ్యారు'' అని స్థానిక పోలీసు అధికారి ఇనాయక్ బుగ్టి తెలిపారు. క్వెట్టాలోని నాటో తాత్కాలిక శిబిరంపై గత గురువారం సాయుధ దుండగులు తుపాకులు, రాకెట్లతో దాడి చేసి 34 ట్రక్కులను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. అఫ్ఘానిస్థాన్‌లో యుద్ధం చేస్తున్న అమెరికా సైనికులకు ఆహారం అందకుండా చేసేందుకు ఇటువంటి దాడులు చేస్తామని గతంలోనే తాలిబాన్ ప్రకటించింది. అఫ్ఘానిస్థాన్ ద్వారా పాకిస్థాన్‌కు వచ్చే సప్లై లైన్స్ మూసివేత మరిన్ని వారాలపాటు కొనసాగవచ్చని చెప్పారు.

సరికొత్త నిబంధనలతో అమెరికాతో ఒప్పందం కుదుర్చుకునే వరకు వాటిని తెరిచేది లేదని బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో గిలానీ తేల్చి చెప్పారు. పాకిస్థాన్ గగనతలంలో అమెరికా విమానాలను నిషేధించే అవకాశం లేకపోలేద ని స్పష్టం చేశారు. కాగా, విదేశీ విధానాన్ని పునః సమీక్షించడమే ధ్యేయంగా అమెరికాతోపాటు భారత్, చైనా, జర్మనీ, సౌదీ తదితర 15 దేశాల్లోని పాక్ రా యబారులు సోమవారం ఆ దేశ రాజకీయ, మిలటరీ అ ధికారులతో సమావేశమయ్యారు.

రెండు రోజుల ఈ సదస్సులో పాక్ విదేశాంగ విధానంలోని వివిధ కోణాలపై చర్చించడమే కాకుండా అమెరికా, భారత్ వంటి కీలక దేశాలతో సం బంధాలనూ పునర్ నిర్వచించేందుకు సిఫారసులు చేస్తా రు. నాటో దాడిపై ఐఎస్ఐ చీఫ్ షుజా పాషా, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్మన్ షమీమ్ విన్నె సమావేశానికి వివరించినట్లు సమాచారం. కాగా, బలూచిస్థాన్‌లో ని షబ్షి ఎయిర్ బేస్‌ను అమెరికా ఖాళీ చేసింది. అక్కడ ఒక్క చిన్న ఆధారం కూడా లేకుండా కాల్చేసింది.

0 comments:

Post a Comment