Friday

శృంగార పాఠాల స్కూల్

ఆస్ట్రియాలో 2012లో ప్రారంభం
ఉదయం చుంబన సేవనం.. మధ్యాహ్నం కౌగిలి భోజనం.. సాయంత్రం పుష్ప నివేదనం.. రాతిరివేళల మహనైవేద్యం.. అని ఓ తెలుగు సినీ కవి అ ప్పుడెప్పుడో సరదాగా రాశారు. ఇప్పుడు దాన్ని అక్షరాలా నిజం చేసే శృంగార పాఠశాల (సెక్స్‌స్కోలా) ఒకటి ఆస్ట్రియా రాజధాని వియెన్నాలో 2012లో ఏర్పాటవబోతోంది! ప్ర పంచంలోనే తొలి అంతర్జాతీయ సెక్స్ స్కూల్‌గా మీడియాలో బహుళప్రాచుర్యం పొందుతున్న దీని రూపకర్త స్వీడన్‌కు చెందిన ఇల్వా మారియా థాంప్సన్ అనే మహిళ. గతంలో ఆవిడ శృంగార కార్యక్రమాలు ప్రసారం చేసే ఓ చానెల్‌లో ప్రజెంటర్‌గా పనిచేసింది.

ఆ ఉద్యోగం ఎన్నాళ్లు చేసినా ఒకటేననుకుందో ఏమో ఇలా 'ట్రెండ్' మార్చింది. రతిరహస్యాలు నేర్పే పాఠశాలగా రూపుదిద్దడం మొదలెట్టింది. పదహారేళ్లు దాటిన వారెవరైనా ఈ స్కూల్లో చేరవచ్చని ఆవిడ సెలవిస్తోంది. ఫీజు విషయానికొస్తే ఒక్కో టర్మ్ (ఆరునెలలు)కు 1400 పౌండ్లు. మన కరెన్సీలో దాదాపు రూ.లక్షా పదిహేనువేలు! అ యితేనేం.. ఇంచక్కా థియరీ క్లాసులతో పాటు, ప్రాక్టికల్స్ కూడా ఉంటాయట. స్కూలు ప్రాంగణంలో ఉండే 'కో-ఎడ్యుకేషన్' డార్మిటరీలో హోమ్‌వర్క్ చేసుకునే వెసులుబాటూ కల్పించారు. "మా బోధన చెప్ప డం వరకే పరిమితం కాదు, ప్రాక్టికల్స్ కూడా ఉంటాయి. మంచి ప్రేమికుడు/ప్రేమికురాలు అనిపించుకోవడం ఎలా అనేది మా ప్రధాన పాఠ్యాంశం'' అని ఇల్వా ఉత్సాహంగా, ఊరించేలా చెబుతున్నారు.

ఆ అంశంతో పాటు శృంగార భంగిమలు, తడిమే కళలో శిక్ష ణ, అవయవ అవగాహనా కార్యక్రమం.. ఇలా వింటేనే మధురోహల్లో తేలిపోయే సిలబస్‌ను వారు రూపొందించారు. పాఠ్యాంశాలు, శిక్షణావిధానాలు ఇంత టెంప్టింగ్‌గా ఉంటే విజయవంతమవక ఏం చేస్తుందిలే అనుకుంటున్నారేమో..ఈ స్కూలు వాళ్లు రూపొందించిన వాణిజ్య ప్రకటనలపై ఆస్ట్రియన్ టీవీ ఇప్పటికే నిషేధం విధించింది. కొసమెరుపు:"రతి రహస్యాల పాఠశాల కాన్సెప్టు బా గానే ఉందిగానీ.. అందరూ పురుషులే చేరితే సంగతేమి టి చెప్మా'' అని కొందరు సందేహజీవుల ధర్మసందేహం!

0 comments:

Post a Comment