Friday

ఇక యుద్దమేనా?

అఫ్ఘానిస్థాన్‌లో ఇద్దరు పాకిస్థానీలను కాల్చి చంపిన నాటో దళాలు
మరింత ఉద్రిక్తంగా అమెరికా- పాక్ సంబంధాలు
 అమెరికా - పాకిస్థాన్‌ల మధ్య మరింత అగాధం పెరుగుతోంది. వాటి మధ్య ఇప్పటికే జరుగుతున్న అంతర్యుద్ధం మరింతగా ముదిరే అవకాశం కనిపిస్తోంది. అమెరికాతో ఇక తెగదెంపులేనంటూ.. పాకిస్థాన్ సైన్యం, ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు యుద్ధానికి దారి తీసే అవకాశం ఉందనే ఆందోళనా వ్యక్తం అవుతోంది. కొద్ది రోజుల కింద సరిహద్దులోని మిలటరీ స్థావరాలపై నాటోదళాలు చేసిన వైమానిక దాడిలో 24 మంది పాకిస్థాన్ సైనికులు మరణించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అమెరికా అంటేనే పాకిస్థాన్ మండిపడుతోంది.


తాజాగా.. అఫ్ఘానిస్థాన్‌లో ఇద్దరు పాకిస్థానీ జాతీయులను అమెరికా నేతృత్వంలోని నాటో సైన్యాలు కాల్చిచంపాయి. ఇది మరింత ఉద్రిక్తతకు తెరతీసింది. ఈ ఘటనపై పాకిస్థాన్ సైన్యం తీవ్రంగా స్పందించింది. ఇది మరింతగా రెచ్చగొట్టే చర్య అని వ్యాఖ్యానించింది. పాకిస్థాన్‌లోని బెలూచిస్తాన్ ప్రాంతానికి చెందిన అబ్దుల్లా, మహమ్మద్ ఉస్మాన్ అఫ్ఘానిస్థాన్‌లోని బిబిజాన్ ప్రాంతంలోని బంధువుల వద్దకు వచ్చారు. వారిని ఉగ్రవాదులుగా భావించిన నాటో దళాలు గురువారం ఉదయం కాల్చి చంపాయి. ఈ విషయాన్ని అక్కడి లెవీస్ మిలీషియా పాకిస్థాన్ మీడియాకు «ద్రువీకరించింది. తాజా పరిణామాల నేపథ్యంలో అమెరికా - పాకిస్థాన్‌ల మధ్య విద్వేషాలు మరింత పెరగవచ్చని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

0 comments:

Post a Comment