అంతర్జాతీయ దేశాల్లో వస్తువుల ధరలు ద్రవ్యో ల్బణంపై పెద్దస్థాయిలో ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి కానీ డాలరుపై రూపాయి విలువ పతనం కావడం వల్ల దీనిపై ప్రభా వం పడదని ప్రధానమంత్రి సలహా మండలి ఛీఫ్ సి.రంగరాజన్ అన్నారు. బ్యాంకింగ్ టెక్నాలజీలో అభివృద్ధి, పరిశోధన సంస్థ వ్యవ స్థాపక దినోత్సవం కార్యక్రమానికి హాజరైన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గత 28 నెలలుగా ద్రవ్యో ల్బణం దాదాపుగా రెండు అంకెల స్థాయిలోనే ఉన్న విషయం తెలిసిందే. 'రూపాయి విలువ తగ్గుదల దిగు మతులపై ప్రభావం చూపిస్తుంది. ఖచ్చితంగా చమురు వంటి దిగుమతి వస్తువులు మరింత ప్రియమ వుతాయి. అయితే, ఈ వస్తువులపై డాలరు ధర ఎలా ఉందనే విష యంపైనే అంతిమంగా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం ఆధారపడి ఉంటుంది' అని రంగరాజన్ చెప్పారు. ప్రపంచ దేశాల్లో వస్తువుల ధరలు భారత్‌పై పెద్ద స్థాయిలో ప్రభావం చూపుతున్నాయి. ముడిచమురు అవసరాల్లో 80 శాతం వరకు మనం దిగుమతి చేసుకుంటున్నాం. రూపాయి విలువ బలహీనపడిన కారణంగా దిగుమతులపై ప్రతి డాలరుపైన మరింత ఎక్కువ రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది' అని అన్నారు. 'ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పటిష్టం కాకపోయినట్లయితే అంతర్జాతీయ వస్తువుల ధరలు తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి' అని పేర్కొన్నారు. ఈ నెలలో రూపాయి విలువ డాలరు మీద మునుపెన్నడూ లేని విధంగా 52.73లకు పడిపోయింది. ఇది కోలుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. సోమవారం ఉదయం డాలరుపై 35 పైసలు పెరగడంతో రూపాయి విలువ 51.90లకు వచ్చింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు ఇంకా పుంజుకోలేదు. యూరోజోన్‌లోని అనేక దేశాలు రుణ సంక్షోభాన్ని ఎదుర్కొంటూనే ఉన్నాయి. 2012 మార్చినాటికి ద్రవ్యోల్బణం 7 శాతానికి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గత ఏడాది డిసెంబరు నుంచి ఇది 9 శాతం పైగానే ఉన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది అక్టోబరులో ఇది 9.73 శాతంగా ఉంది.
0 comments:
Post a Comment