Tuesday

లిబియా పాలకుల ఖైదులో 7వేల మంది



RUSSIA DEMANDING REMOVAL OF   NUCLEAR  WEAPONS OF MASS DESTRUCTION FROM LIBYA!

లిబియా మాజీ రెబెల్స్‌ ఇప్పటికీ 7000మందిని ఖైదు చేసి వుంచారని ఐక్యరాజ్య సమితి చెబు తోంది. వీరిలో అనేక మంది సబ్‌- సహారా ఆఫ్రికన్లు, వీరంతా గదాఫీ కిరాయి సైనికులని ఆపద్దర్శ పాల కుల అనుమానం. పోలీసు, కోర్టులు అందుబాటులో లేనందున ఖైదీలకు న్యాయక్రమం అసలు అందు బాటు లోనే లేదు. ఈ సమస్యను పరి శీలించవలసిందిగా ఒత్తిడి చేయగా నూతన లిబియా ప్రభుత్వం సాను కూలంగా స్పందించిందని ఐరాస తెలిపింది. ఎనిమిది నెలల అంత ర్యుద్ధం ముగిసిన తరువాత లిబియా పరిస్థితిని ఐరాస అంచనా వేయడం ఇదే ప్రధమం. ప్రస్తుతం 7000 మంది ఖైదీలు లిబియాలోని జైళ్ళు. విప్లవ సేన ఆధీనంలోని తాత్కాలిక నిర్బంధ కేంద్రాలలో వున్నారని ఐరాస ప్రధాన కార్యదర్శి బాన్‌ కి మూన్‌ నివేదిక చెబుతోంది. ఖైదీల బాధ్యతను విప్లవ సేన బ్రిగేడ్‌ల నుండి సంబంధిత ప్రభుత్వాధికా రులకు బదిలీ చేస్తూ లిబియా జాతీయ పరివర్తనా మండలి కొన్ని చర్యలు తీసుకున్నా, అనేక మందిని అధికారికంగా ఖైదీలుగా ప్రక టించాల్సివుంది. దుర్వినియోగం, దాడులను నిరోధించి, నిర్భంధం పొడిగించకూడని వారిని విడుదల చేయవలసి వుందని నివేదిక పేర్కొంది. ''నూతన లిబియా నాయ కులు, మానవ హక్కులను గౌరవించే ప్రాతిపదికన నూతన సమాజ నిర్మా ణానికి కట్టుబడివున్నారని నేను విశ్వ సిస్తున్నాను'' అని బాన్‌ అన్నారు. పరి స్థితులు ఎంతకష్టంగా వున్నా, ఇది సాధించడానికి అక్రమ నిర్బంధాలకు తెరదించి, హక్కుల ఉల్లంఘన, వివ క్షను నిరోధించడానికి, తక్షణ కార్యా చరణ అవసరం. లిబియా పౌరు లలోని ఏ గ్రూపు సభ్యులైనా, తృతీయ దేశ పౌరులైనా వారి హక్కు లను ఉల్లంఘించరాదు'' అని బాన్‌ పేర్కొన్నారు. ట్రిపోలీలో తాత్కాలిక ప్రభుత్వ నియామకాన్ని ఐరాసలో లిబియా దూత ఇయాన్‌ మార్టిన్‌ స్వాగతించారు. గత ప్రభుత్వానికి, ఇప్పటి ప్రభుత్వానికి ఇదే తేడా, మానవహక్కుల ఉల్లంఘనలను తిరస్కరించడం లేదు. అనేక సంద ర్భాలలో అంతర్జాతీయ సంఘాలు ఖైదీలను కలుసుకునేందుకు అనుమ తించబడు తోందని ఆయన చెప్పారు. ప్రజా విమర్శను నూతన హోం మంత్రి స్వాగతించారని, ఇది, సమస్యల పరిష్కారంలో తనకు మరింత బలాన్ని స్తోందని చెప్పారని మార్టిన్‌ బిబిసితో అన్నారు. నూతన ప్రభుత్వ సభ్యుల వైఖరి ఎలా వున్నా, భద్రతా మండలి, తాత్కాలిక ప్రభు త్వం అనేక సవాళ్ళను ఎదుర్కోవలసి వుందని అన్నారు. పోలీసు దళం లేనందున శాంతి, భద్రతల కార్యక్ర మాలను నిర్వర్తిస్తున్న విప్లవ సేనను క్రమబద్దీకరించి, వారి ఆయుధాలను స్వాధీనం చేసుకోవలసి వుంది. ఆయుధ నిల్వలను సమకూర్చుకుని, ఆయుధ వ్యాప్తిని నిరోధించాలి. జూన్‌ నాటికి ఎన్నికలు నిర్వహించగల ఎన్ని కల వ్యవస్థను నిర్మించాల్సి వుంది.

0 comments:

Post a Comment