Monday

దుస్తులు విప్పించి తనిఖీ అమెరికా విమానాశ్రయంలో 85 ఏళ్ల వృద్ధురాలికి అవమానం

అమెరికాలోని విమానాశ్రయాల్లో వీఐపీలకే అవమానాలు ఎదురవుతున్న నేపథ్యంలో ఇక సామాన్యులకు కలిగే ఇబ్బందులను ఊహించవచ్చు. తాజాగా ఓ 85ఏళ్ల వృద్ధురాలికి ఇక్కడి జాన్ ఎఫ్ కెన్నడీ విమానాశ్రయంలో తీవ్ర అవమానం జరిగింది. ఆమె దుస్తులు విప్పదీసి మరీ తనిఖీలు చేయడం వివాదాస్పదమైంది. లాంగ్ ఐలండ్‌లో నివసించే లినోర్ జిమ్మర్‌మన్.. ఫోర్ట్ లాడర్‌డేల్ వెల్లడానికి జేఎఫ్‌కే ఎయిర్‌పోర్టుకు వ చ్చారు. బ్యాగుల తనిఖీ పూర్తయిన తర్వాత వీల్ చెయిర్ కోసం వేచి చూస్తుండగా అక్కడకి వచ్చిన రవాణా భద్రతాధికారులు ఆమెను ఓ ప్రత్యేక గదిలోకి తీసుకెళ్లారు. 

ఎందుకిలా చేస్తున్నారని ప్రశ్నిస్తున్నా వినకుండా తనని బట్టలు విప్పించి తనిఖీ చేశారని జిమ్మర్‌మన్ చె ప్పారు. ఈ క్రమంలోనే తన చేతిలోని వాకర్ వల్ల ఆమె కాలుకు గాయమై తీవ్ర రక్తస్రావమైంది. చాలాసేపు తనిఖీ చేయడంతో ఆమె ప్రయాణించాల్సినవిమానం కూడా వెళ్లిపోయింది. విమానాశ్రయ అధికారులు మాత్రం ఆమె ఆక్రందనను పట్టించుకున్న పాపానపోలేదు. పైగా, తాము అన్నీ నిబంధనల ప్రకారమే చేశామని సెలవిచ్చారు. నానా అవస్థలు పడిన జిమ్మర్‌మన్ ఇప్పుడు వారిపై కేసు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు.

0 comments:

Post a Comment