Monday

ప్రపంచశ్రేణి ఉపాధ్యాయుడిగా ఆనంద్ ఎంపిక

పేద విద్యార్థులకు ఐఐటీ-జేఈఈకి ఉచితంగా శిక్షణ ఇస్తున్న గణిత మాంత్రికుడు ఆనంద్ కుమార్.. ప్రపంచంలోనే అగ్రశ్రేణి ఉపాధ్యాయులు మొదటి 20 మందిలో ఒకరిగా ఎంపికయ్యారు. ఇంగ్లండ్ నుంచి ప్రచురితమయ్యే 'మోనోకిల్' అనే పత్రిక ప్రచురించిన జాబితాలో భారత్ నుంచి ఆనంద్ కుమార్ ఒక్క పేరే ఉంది. 'సూపర్30' సంస్థను నెలకొల్పిన ఆయన పదేళ్లుగా పేద విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇస్తున్నారు. గణితం బోధించడంలో ఆయన అవలంబించిన విధానాలతో.. బాలీవుడ్ నటులకున్న ఆదరణకు ఏమాత్రం తీసిపోరని 'మోనోకిల్' పత్రిక పేర్కొంది.

0 comments:

Post a Comment