Monday

ఆ ఒంటె ధర రూ.3.5 కోట్లు!

కువైట్‌లో ఓ ఒంటె రికార్డు సృష్టించింది. ఏవో విన్యాసాలు చేసి కాదు సుమా! మార్కెట్లో ఊహించనంత రేటుకు అమ్ముడుపోయింది. ఓ అరబ్బు జాతీయుడు తను ముద్దుగా పెంచుకున్న అందాల ఒంటెను 20లక్షల దినార్లకు అమ్మాడు. అంటే మన కరెన్సీలో ఇది సుమారు మూడున్నర కోట్లకుపైమాటే! ఒంటెతో పనేముంది... అనుకుంటున్నారా? తమ సంస్కృతిని ప్రతిబింభించే ఎడారి ఓడలను పెంచుకోవడానికి అరబ్బులు చాలా ఆసక్తి చూపుతారు. వాటి కి అత్యంత ప్రాధాన్యతనిస్తారు. నచ్చిన ఒంటెను ఎలాగైనా సొంతం చేసుకోవాలనుకుంటారు. అలాంటి ఓ వ్యక్తే ఇంత భారీ మొత్తం చెల్లించడానికి సిద్ధమయ్యాడు. అయితే, ఈ సొమ్మంతా నగదు రూపంలోనే కావాలని ఒంటె యజమాని పట్టుపట్టడం వల్లే ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

0 comments:

Post a Comment