Monday

పుతిన్-మెద్వెదెవ్ అధికారానికి గండి


రష్యాలో కొన్నేళ్లుగా సాగుతున్న పుతిన్-మెద్వెదెవ్ అప్రతిహత అధికారానికి గండిపడినట్టుగా ఆదివారం వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు సూచిస్తున్నాయి. ఎన్నికల్లో కేవలం 48.50 శాతం ఓట్లు మాత్రమే పోలయిన పరిస్థితిని గమనిస్తే.. పార్లమెంటులో ఈ ద్వయం ప్రాతినిధ్యం వహిస్తున్న అధికార యునైటెడ్ రష్యా పార్టీకి మూడింట రెండు వంతుల మెజారిటీ దక్కని పరిస్థితి నెలకొంది. 

ఫలితంగా, ప్రస్తుత అధ్యక్షుడు మెద్వెదెవ్‌ను తదుపరి ప్రధానిగా నియమించే విషయంలో అవరోధాలు తప్పేలా లేవు. వచ్చే మార్చిలో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి దిగుతున్న పుతిన్ భవితవ్యం కూడా అప్పటికి తేలిపోతుంది. వీటీఎస్-ఐవోఎం ఆదివారం ప్రకటించిన ఎగ్జిట్‌ఫోల్ ఫలితాల ప్రకారం.. రష్యా దిగువ సభ డూమాలో యూఆర్‌పీకి 48.5శాతం ఓట్లే వచ్చాయని ప్రభుత్వ రొస్సియా-24 టీవీ ప్రసారం చేసింది. 

ఇది 2007 ఎన్నికల్లో వచ్చిన 64 శాతం కన్న బాగా తక్కువ. 450 సీట్లున్న డ్యూమాలో నాలుగింట మూడువంతుల మెజారిటీ రావాలంటే ఇప్పటిలా 315 సీట్లు తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఎఫ్‌వోఎం చేపట్టిన మరో ఎగ్జిట్‌పోల్ ప్రకారమైతే, కొంచె ఎక్కువగా అంటే అది కూడా 46 శాతం ఓట్లు మాత్రమే పాలక పక్షానికి లభిస్తాయి. ఇతర పార్టీల్లో కమ్యూనిస్టు పార్టీ (కేపీఆర్ఎఫ్)కి 19.80 శాతం, ఏ జెస్ట్ రష్యా పార్టీకి 12.80 శాతం, అల్ట్రా నేషనలిస్టుల ఎల్‌డీపీఆర్‌కు 11.42 శాతం వచ్చినట్టుగా వీటీస్ ఎగ్జిట్‌పోల్ చెపుతోంది. ఎన్నో అక్రమాలు జరిగాయని హోరెత్తిన ఈ దిగువసభ ఎన్నికల్లో 11 కోట్ల మంది రష్యన్లు ఓటు హక్కు వినియోగించుకొన్నారు.

0 comments:

Post a Comment