రాజస్థాన్‌లో ఆరు రోజులుగా ప్రభుత్వ వైద్యులు చేస్తున్న సమ్మెను అణచివేయడానికి రాజస్థాన్ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఆందోళన చేస్తున్న 400 మంది వైద్యులను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో అత్యధికులను ఎస్మా చట్టం కింద అరెస్టు చేశారు. 40మందిని తక్షణమే విధులనుంచి తొలగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
సమ్మె మాని తక్షణమేవిధులకు హాజరు కాకపోతే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ హెచ్చరించారు. మరో పక్క వైద్యులు కూడా తమ డిమాండ్లకు కట్టుబడి ఉంటామని ప్రకటించడంతో ప్రతిష్టంభన కొనసాగుతోంది. గత ఆరురోజులుగా జరుగుతున్న సమ్మెకారణంగా వైద్యులు విధులకు హాజరు కావడంలేదు. దీంతో వైద్యం అందక సుమారు 50మంది ప్రాణాలు కోల్పోయారు.

0 comments:
Post a Comment