Tuesday

చైనాలో సూపర్ హైస్పీడ్ రైలు...


 హైస్పీడ్ రైళ్ల రూపకల్పనలో చైనా ముందంజలో ఉంది. తాజాగా గంటకు 500 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే రైలును గతవారం చివరలో ప్రయోగాత్మకంగా పరీక్షించింది. చైనాలో ప్రసిద్ధమైన ఓ పురాతన ఖడ్గం ఆకారంలో దీన్ని రూపొందించిన 'సీఎస్ఆర్ కార్ప్', భవిష్యత్తులో ఇంత వేగంగల రైళ్ల అవసరం ఉండకపోవచ్చని పేర్కొంది. చైనా అధికార వార్తా సంస్థ 'జిన్హువా' అధికారులను ఉటంకిస్తూ ఈ వివరాలు వెల్లడించింది. అయితే, ఈ ఏడాది జూలైలో రెండు హైస్పీడ్ రైళ్లు ఢీకొన్న నేపథ్యంలో ప్రజలలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, అందువల్ల వేగంకన్నా భద్రతకే ప్రాధాన్యం ఇస్తామని సీఎస్ఆర్ కార్ప్ తెలిపిందని పేర్కొంది.

0 comments:

Post a Comment