డిసెంబర్ 22న జాతీయ గణిత దినోత్సవం
ప్రత్యేక తపాలా బిళ్ల విడుదల..
దేశంలో సమర్థులైన గణిత శాస్త్రవేత్తల కొరత
ఈ పరిస్థితి మారాల్సిందే: ప్రధాని మన్మోహన్

ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్‌కు నివాళిగా.. 2012ను జాతీయ గణిత సంవత్సరంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అంతేగాక.. రామానుజన్ జయంతి రోజైన డిసెంబర్ 22ను ఏటా జాతీయ గణిత దినోత్సవం గా జరుపుకోవాలని నిర్ణయించింది. సోమవారం మద్రాస్ యూనివర్సిటీలో శ్రీనివాస రామానుజన్ 125వ జయంతి కార్యక్రమంలో ప్రధాని మన్మోహన్‌సింగ్ పాల్గొన్నారు. రామానుజన్ దేశం గర్వించదగిన గొప్ప గణిత శాస్త్రవేత్త అని మన్మోహన్ ప్రశంసించారు.
ఆ స్థా యికి రావడానికి రామానుజన్ ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొన్నాడని పేర్కొన్నారు. దేశంలో సమర్థులైన గణిత శాస్త్రవేత్తల కొరత తీవ్రం గా ఉందని, ఆకర్షణీయమైన ఉపాధి అవకాశాలు లేకపోవడమే అం దుకు కారణమని ప్రధాని చెప్పారు. ఈ పరిస్థితి 'తప్పక మారాల్సి'ందేనని పేర్కొన్నారు. "మూడు దశాబ్దాలుగా ఉన్నత స్థాయిలో విద్యార్థులు గణితంపై ఆసక్తి చూపడం లేదు. దీని వల్ల దేశంలోని కాలేజీలు, స్కూళ్లలో గణితం బోధించే ఉపాధ్యాయుల్లో నాణ్యత త గ్గిపోయింది.
కొన్నేళ్ల కిందటిదాకా.. గణితం చదివిన వారికి ఆకర్షణీయమైన ఉపాధి అవకాశాల్లేవు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. భవిష్యత్తులో కూడా గణితానికి మరింత ప్రాధాన్యం పెరుగుతుంది' అని మన్మోహన్ అన్నారు. జాతీయ గణిత సంవత్సరం సందర్భం గా.. కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి కపిల్ సిబల్ ఆధ్వర్యం లో వచ్చే యేడాది పొడవునా కార్యక్రమాలను చేపడతామన్నారు. కేరళకు చెందిన మాధవ అనే గణిత శాస్త్రవేత్త న్యూటన్, లిబిండ్జ్ కం టే 2 శతాబ్దాల ముందే కాలిక్యులస్ గణితాన్ని అభివృద్ధి చేశాడని తె లిపారు.
20వ శతాబ్దం ద్వితీయార్థంలో నోబుల్ బహుమతి గ్రహీతలు సీవీ రామన్, సుబ్రమణ్యం చంద్రశేఖర్, శ్రీనివాస రామాను జన్ వంటి గణిత మేధావులు భారత కీర్తిని ప్రపంచానికి చాటారన్నారు. రామానుజన్ జీవిత కథ రచించిన ఆచార్య రాబర్ట్ కెంగాల్ ని ప్రధాని అభినందించారు. రామానుజన్ జయంతి సందర్భంగా ముద్రించిన తపాలా బిళ్లను విడుదల చేశారు. అంతేగాక ప్రధాని శివగంగై జిల్లా కారైక్కుడిలో నిర్మించిన రామానుజన్ కేంద్రాన్ని, మ రో రెండు ప్రైవేటు ఆసుపత్రులను లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో గవర్నర్ రోశయ్య, కేంద్ర మంత్రులు కపిల్ సిబల్, జయంతి నటరాజన్, జీకే వాసన్, నారాయణ స్వామి పాల్గొన్నారు.
పదేళ్లకే గణితంపై పట్టు
శ్రీనివాస రామానుజం తమిళనాడులోని ఈరోడ్ ప్రాంతానికి చెందిన ఓ పేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. పదేళ్ల వయస్సు నుంచే గణితంలో ప్రజ్ఞను ప్రదర్శించిన ఆయన.. గణితంలో కష్టసాధ్యమె ౖన 'త్రికోణమితి' విభాగంపై పన్నెండేళ్ల వ యస్సులోనే పూర్తిగా పట్టు సాధించారు. 17 ఏళ్ల వయస్సులోనే 'బెర్నౌలీ సంఖ్యలు, యూలర్ అనంత సంఖ్యల సిద్ధాంతా'లపై పరిశోధనలు చేశారు. ఆయన ప్రతిభను గుర్తించిన ప్రభు త్వం కుంభకోణంలోని కళాశాలలో చదువుకోవడానికి స్కాలర్‌షిప్ ఇచ్చింది. కానీ, గణితేతర సబ్జెక్టుల్లో ప్రతిభ చూపకపోవడంతో ఆ తరువాత స్కాలర్‌షిప్‌ను నిలిపివేశారు.
దాంతో మద్రాస్ పోర్టు ట్రస్టు కార్యాలయంలో గుమాస్తాగా చేరి, ఆ డబ్బుతో మరో కాలేజీలో చదువుతూ.. గణిత పరిశోధనలు చే శారు. తన సిద్ధాంతాలను కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి పంపించా రు. వాటిని పరిశీలించిన యూనివర్సిటీ అధికారులు అక్కడికి ఆహ్వానించారు. కొద్దిరోజులకే రాయల్ సొసైటీ, ట్రి నిటీ కళాశాల ఫెలోషిప్‌లను పొందారు. కొంత కాలానికే.. ఆరోగ్యం చెడిపోవడంతో భారత్ తిరిగి వచ్చారు. 1920లో కాలేయ సంబంధిత వ్యాధితో 32 ఏళ్ల అతిచిన్న వయస్సులోనే రామానుజన్ మరణించారు. ఆ కొంత కాలంలోనే రామానుజన్ దాదాపు 3200 ఈక్వేషన్స్‌ను, ఐడెంటీటీస్‌ను సాధించారు. 'రామాను జం ప్రైమ్, రామానుజం టీటా ఫంక్షన్'లను రూపొందించారు.

0 comments:
Post a Comment