Monday

కువైట్‌లో రాజకీయ సంక్షోభం

Kuwait
కువైట్‌లో రాజకీయ సంక్షోభం నెలకొనడంతో ఎట్టకేలకు అక్కడి కేబినెట్ మూకుమ్మడిగా రాజీనామా చేసింది. రాజీనామాను కువైట్ రాజు (అమీర్) ఆమోదించారని, త్వరలోనే కొత్త ప్రభుత్వం ఏర్పడనుందని ప్రతిపక్ష ఎంపీ ఖలేద్ అల్-సుల్తాన్ తెలిపారు. అమిర్ షేఖ్ సబా అల్-అహ్మద్ అల్-సబా, ప్రధాని షేఖ్ నస్సర్ మొహమ్మద్ అల్-అహ్మద్ అల్ సబా నేతృత్వంలోని మంత్రివర్గంతో జరిగిన అత్యవసర సమావేశం తరువాత ఈ రాజీనామా ప్రకటన వెలువడింది.

ఈ రాజీనామాపై వ్యాఖ్యానించడానికి పార్లమెంటు స్పీకర్ జస్సెమ్ అల్-కొరాఫీ నిరాకరించారు. అయితే పార్లమెంటును రద్దు చేస్తున్నట్టు తాను ఇంతవరకు ప్రకటించలేదని తెలిపారు. కాగా అవినీతి ఆరోపణలపై పార్లమెంటరీ కమిటీ త్వరలో ప్రధానిని ప్రశ్నించనుండడంతో కేబినెట్ రాజీనామా తెరపైకి వచ్చింది.

0 comments:

Post a Comment