Tuesday

మధుమేహులకు 'తీపి' కబురు...



New diabetes treatments on horizon

మీరు మధుమేహ పీడితులా!? దీనికి చికిత్స లేదని నిరాశ చెందుతున్నారా!? అయితే, మీకో 'తీపి' కబురు! నాలుగు నెలలపాటు క్రమం తప్పకుండా రోజూ తక్కువ కెలోరీలున్న ఆహారం తీసుకుంటే.. మధుమేహం మటుమాయం అయిపోతుంది. నెదర్లాండ్స్‌లోని లీడెన్ యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనం ఈ విషయా న్ని బయటపెట్టింది. రోజూ తాము తీసుకునే కెలోరీలను తగ్గించిన మధుమేహ రోగుల ఆరోగ్య పరిస్థితి గణనీయంగా మెరుగుపడిందని అధ్యయనంలో తేలింది.

అంతేనా.. ఇన్సులిన్ వాడాల్సిన అవసరం వారికి ఎప్పటికీ రాదు. వారి గుండె చుట్టూ పేరుకునే ప్రమాదకరమైన కొవ్వు స్థాయి కూడా గణనీయంగా తగ్గిపోతుంది. దాంతో, వారి గుండె పనితీరు కూడా మెరుగుపడుతుంది. "తక్కువ కెలోరీలు కలిగిన ఆహారం తీసుకుంటే మధుమేహం ఎలా పోతుందన్న ప్రశ్న రావచ్చు. అయితే, దీని ఫలితాలు దీర్ఘకాలికం. మధుమేహ రోగులకు మందుల కంటే కూడా జీవనశైలి మార్పుల కారణంగా గుండె పనితీరుపై ఎక్కువ ప్రభావం చూపుతాయి'' అని పరిశోధనకు నేతృత్వం వహించిన సెబాస్టియన్ హేమర్‌ను ఉటంకిస్తూ ది డెయిలీ మెయిల్ ప్రచురించింది.

మధుమేహ రోగులు, ఊబకాయులకు గుండెపోటు, గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ పరిశోధనకు ప్రాధాన్యం ఏర్పడిందని పరిశోధకులు వివరించారు. పరిశోధనలో భాగంగా.. ప్రతిరోజూ తీసుకునే కెలోరీలను తగ్గిస్తే ఏర్పడే దీర్ఘకాలిక ఫలితాలను తెలుసుకోవాలని పరిశోధకులు భావించారు. వాస్తవానికి, గుండె చుట్టూ పేరుకొనే కొవ్వు గుండె సరిగా పని చేయకుండా నిలుపుచేస్తుంది. మరీ ముఖ్యంగా, ఊబకాయులు, మధుమేహ రోగుల్లో గుండె జబ్బులకు కారణమవుతుంది.

అయితే, 16 వారాలపాటు ప్రతిరోజూ తీసుకునే కెలోరీలపై నియంత్రణ పాటిస్తే.. మధుమేహ రోగుల్లో గుండె పనితీరు మెరుగుపడిందని తమ అధ్యయనంలో తేలిందని హేమర్ తెలిపారు. స్కానర్లను ఉపయోగించి 15 మంది టైప్-2 మధుమేహ రోగుల్లో గుండె, దాని చుట్టూ పేరుకొనే కొవ్వుపై అధ్యయనం చేశారు. వీరికి కెలోరీలను తగ్గించడం వల్ల బీఎంఐ కూడా 35.3 నుంచి 27.5కు తగ్గింది. గుండె చుట్టూ పేరుకొనే కొవ్వు మూడోవంతు తగ్గింది. గుండె పనితీరు మెరుగు పడింది. ఆ తర్వాత మరో 14 నెలలపాటు మామూలుగా ఆహారం తీసుకున్నా బీఎంఐ 31.7కు చేరితే.. గుండె చుట్టూ పేరుకొనే కొవ్వు కొద్దిగానే పెరిగింది.

0 comments:

Post a Comment