* ఒబామాకు స్పష్టంచేసిన మన్మోహన్
భారతీయ చట్టాల ప్రకారమే అణు ఒప్పందం అమలు జరుగుతుందని ప్రధాని మన్మోహన్ సింగ్ స్పష్టం చేశారు. బాలీలో అమెరికా అధ్యక్షుడు ఒబామాతో భేటీ అయిన ప్రధాని గతంలో జరిగిన అణు ఒప్పందం అంశంపై చర్చించారు. ఆసియాన్ సమ్మిట్‌లో భాగంగా సమావేశమైన ఇరు దేశాల అధినేతలు గంటకు పైగా సుధీర్ఘంగా చర్చించారు. అమెరికా-భారత్ దేశాలు అణు ఒప్పందం అంశంపైనే కాకుండా ఇతర అంశాలపై కూడా కలిసి పనిచేసేందుకు సమావేశం దోహదపడిందని ప్రధాని మన్మోహన్ చెప్పారు.
బాలీ సమావేశంతో ద్వైపాక్షిక అంశాలపైనే కాకుండా బహుళ సంబంధాలపై పనిచేసేందుకు ఉపయోగపడుతుందని అమెరికా అధ్యక్షుడు ఒబామా ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాని మన్మోహన్ చైనా ప్రధాని వెన్ జియాబావోతో కూడా సమావేశమై భారత్-చైనా అంశాలపై చర్చించారు.ఇరుదేశాలు కలిసి పనిచేస్తే 21వ శతాబ్ధం ఆసియాదే అని అన్నారు.

0 comments:
Post a Comment