Tuesday

కాంగోలో బద్దలైన అగ్ని పర్వతం

AA

* భారీగా ఉబికివస్తున్న లావా
* చూసేందుకు పోటీపడుతున్న టూరిస్టులు 


మనకు దగ్గర్లో అగ్ని పర్వతం బద్దలైతే ఏం చేస్తాం? ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయంతో పరుగులు తీస్తాం. కానీ కాంగోలో మాత్రం దీనికి రివర్స్‌లో జరుగుతోంది. అగ్నిపర్వతం నుంచి ఉప్పొంగుతున్న లావాను చూసేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు. అగ్నిపర్వతం బద్దలైతే చాలు లావాతో సమీప ప్రాంతాలన్నీ బూడిదవుతాయి. అయితే అన్ని అగ్ని పర్వతాలు విధ్వంసం సృష్టించవు. కొన్ని మాత్రమే ప్రమాదకరమైనవి. మరికొన్ని అగ్నిపర్వతాలు ఆందోళన కలిగించకుండా...ప్రజల్లో ఆహ్లాదం నింపేలా లావా వెదజల్లుతాయి.

ఇందుకు ఉదాహరణే కాంగోలో బద్దలైన అగ్నిపర్వతం. కాంగో వైరుంగా నేషనల్ పార్క్‌లో అగ్నిపర్వతం నుంచి ఉప్పొంగుతున్న లావాను చూసేందుకు టూరిస్టులు క్యూ కడుతున్నారు. అంతేకాదు ఈ అగ్నిపర్వతాన్ని చూడాలంటే 14వేల 4వందల రూపాయలు చెల్లించాల్సిందే. ప్రపంచంలోనే చివరి అభివృద్ధి చెందుతున్న దేశమైన కాంగో..ప్రస్తుతం ఈ టూరిజం స్పాట్ ద్వారా భారీగా ఆదాయం సంపాదిస్తోంది. అగ్ని పర్వతాన్ని చూసేందుకు వీలుగా పార్క్‌ అధికారులు సురక్షిత ప్రాంతాన్ని గుర్తించి అక్కడ టెంట్‌లు ఏర్పాటు చేశారు. 650 అడుగుల ఎత్తులో ఉప్పొంగుతున్న లావాను చూస్తూ ....... పర్యాటకులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. 

0 comments:

Post a Comment