Tuesday

ఆఫీసుల్లో అతిగా పనిచేయడం ప్రమాదకరమేనా?

AA

* ఆరోగ్యం దెబ్బతింటుందా?
* `అతి\\\' పనిమంతులపై గ్లోబల్ సర్వే
* 50 శాతం మంది అతి పనిమంతులే
* మన దేశంలో `అతి\\\' పనిమంతులు ఎక్కువే
* 40 శాతం మందికి ఇంట్లోనూ ఆఫీస్ పనే
* 85దేశాల్లో సర్వే చేసిన రేగస్
* 12,000 మంది ఉద్యోగుల పనితీరు పరిశీలన
* అతి పనిమంతుల్లో దీర్ఘకాలిక సమస్యలు
* ఆరోగ్యం కుంటుపడే ప్రమాదం
* స్థూలంగా మందగించే ఉత్పత్తి
* అభద్రతా భావంతోనే ఎక్కువ గంటల పని
* కుటుంబాలకు దూరమవుతున్న ఉద్యోగస్థులు 


ఉద్యోగుల్లో రోజుకు 8 గంటలకంటే ఎక్కువ గంటలు పనిచేసే వారి సంఖ్య మనదేశంలో పెరిగిపోతోంది. 50శాతం మంది ఉద్యోగులు వ్యక్తిగత ఆరోగ్యాన్ని ఫణంగాపెట్టి ఆఫీసుల్లో పనిచేస్తున్నట్టు ఓ సర్వే తేల్చిచెప్పింది. `అతి\\\' పనిమంతుల విశేషాలేమిటో ఇప్పుడు చూడండి. కష్టపడి పనిచేయాలనుకోవడం తప్పుకాదు, కానీ అదేపనిగా అతిగా పనిచేయడం మాత్రం ఆరోగ్యసూత్రాలకు విరుద్ధమేనంటూ ఓ సర్వే తేల్చిచెప్పింది. రోజుకు 9 నుంచి 12 గంటలు పనిచేసే ఉద్యోగులు మనదేశంలో తక్కువేమీకాదని `రేగస్\\\' సంస్థ ఈ మధ్యనే నిర్వహించిన గ్లోబల్ సర్వేలో తేలింది.

దేశంలో 50శాతంకంటే ఎక్కువ మంది ఉద్యోగులు రోజుకు 8 గంటలకంటే ఎక్కువసేపు పనిచేస్తున్నారట. అతి పనిమంతుల్లో ప్రపంచ స్థాయి 38 శాతం కాగా, మనదేశంలో ఇది 45 శాతం దాకా ఉంది. దేశంలోని పదిశాతం కంటే ఎక్కువ మంది ఉద్యోగులు 11 గంటలకంటే ఎక్కువసేపే ఆఫీస్ పని చేస్తున్నట్టు ఈ సర్వే తేల్చిచెప్పింది. ఆఫీసుల్లో ఎక్కువ సేపు పనిచేయడం వల్ల ఉత్పత్తి పెరుగుతుందా? లేదంటే ఉద్యోగ భద్రత కోసమే అతిగా పనిచేస్తున్నారా అన్న కోణాలను కూడా రేగస్ సంస్థ పరిగణలోకి తీసుకుంది. ఇక్కడ కూడా ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి.

పూర్వం పరిస్థితి ఇలా ఉండేది కాదు, ఉద్యోగ భద్రత ఉండేది. కార్యాలయాల్లో పనిచేసేటప్పుడు సమయపాలన పాటించేవాళ్లు. కానీ రోజులు మారాయి. అభద్రతాభావం పెరిగిపోతోంది. దీంతో రోజుకు ఎక్కువ గంటలు పనిచేయాలన్న తపన పెరిగిపోతోందని ఈ సర్వే తేల్చిచెప్పింది. 

0 comments:

Post a Comment