Tuesday

చైనా ఆధిపత్యంపై అమెరికా కన్ను

AA


* ఆసియాపై పెత్తనానికి పెద్దన్న ప్రయత్నం
* తారస్థాయికి చేరిన ఆధిపత్య పోరు
* ఆసీస్‌తో అమెరికా ఒప్పందం 

* చైనాలో మొదలైన కలవరం

డ్రాగన్‌ ఆగడాలకు అడ్డుకట్ట పడనుంది. చైనాను అమెరికా సీరియస్‌గా తీసుకుంటోంది. ఆసియా దేశాలతో సాన్నిహిత్యం పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్న ఒబామా.. ఆసియాన్‌ సదస్సుకు తొలిసారిగా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో చైనా ఆధిపత్య ధోరణిపై సహజంగా అమెరికా ఆగ్రహం వ్యక్తంచేస్తోంది. అగ్రరాజ్యంగా వెలుగొందిన అమెరికా ఇప్పుడు ఆసియా దేశాలతో బంధానికి ఉవ్విళ్లూరుతోంది. ఇండోనేషియాలోని బాలిలో జరుగుతున్న ఆసియాన్ సదస్సుకు US అధ్యక్షుడు ఒబామా హాజరవడం ఇందులో భాగమే.

ఐరోపా దేశాల ఆర్థిక వ్యవస్థలు పతనం దిశగా పయనిస్తుండంతో.. అమెరికా చూపు ఆసియా పులులపై పడింది. అయితే.. ఇక్కడ చైనా ఆధిపత్యం కొనసాగుతుండంతో అగ్రరాజ్యం రగిలిపోతోంది. తన ప్రాబల్యాన్ని పెంచుకునే దిశగా సంబంధాల బలోపేతంపై ఒబామా దృష్టి సారించారు. ఆసియాన్‌ దేశాధిపతులతో ద్వైపాక్షిక చర్చలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఈ ప్రాంతంలో ఏడు రోజులు పర్యటించనున్నారు. ఆసియాన్ దేశాలతో ఒప్పందాల ద్వారా స్వదేశంలో ఉద్యోగ కల్పనకు ఒబామా ప్రాధాన్యం ఇస్తుండగా.. వాటిపై చైనా ప్రభావం చూపుతుందన్న భయమూ అమెరికాను వణికిస్తోంది.

అదే సమయంలో ఆస్ట్రేలియా తీరంలో US బలగాల మోహరింపునకు అనుమతి లభించడం చైనాను కలవరపెడుతోంది. చమురు నిక్షేపాలు పుష్కలంగా ఉన్న దక్షిణ చైనా సముద్రంపై ఆధిపత్యానికి గండి పడుతుందన్న భయం వ్యక్తమవుతోంది. మొత్తమ్మీద అమెరికా, చైనా మధ్య మొదలైన ఆధిపత్య పోరు ఆసియాన్‌ దేశాలకు ఏ మేరకు లాభం చేకూరుస్తుందో చూడాలి. 

0 comments:

Post a Comment