Friday

రికార్డు స్థాయికి రూపాయి పతనం రిజర్వుబ్యాంకు జోక్యంతో ప్రయోజనం ఉండదంటున్న ఆర్థిక

న్యూఢిల్లీ:- అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ భారీగా పతనం అయినప్పటికీ రిజర్వుబ్యాంకు జోక్యం చేసు కున్నా పెద్ద ఉపయోగం ఉండదని విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు అంతర్జాతీయ కారణాల వల్ల తమ నిధులను ఉపసంహరించుకుంటు న్నారని అందుకనే రూపాయి విలువ పడిపోతు  న్నదని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్‌ముఖర్జీ మంగళవారం నాడు పేర్కొన్నారు. ఆయన పత్రికల వారితో మాట్లాడారు. దేశీయ ఈక్విటీ మార్కెట్‌ నుంచి సంస్థాగత ఇన్వెస్టర్లు భారీగా నిధులు ఉపసంహరించుకుంటున్నారని ఆయన అన్నారు. రూపాయి గతంలో ఎన్నడూ లేనంత గా డాలరుతో పోలిస్తే రూ.52.73 స్థాయికి చేరింది. ఇతర దేశాల కరెన్సీలతో పోలిస్తే డాలరు బలపడటం కూడా దీనికి దోహదం చేసింది.

రిజర్వుబ్యాంకు పరిశీలన
రూపాయి పతనాన్ని రిజర్వుబ్యాంకు జాగ్రత్తగా గమనిస్తున్నదని, అవసరమైతే జోక్యం చేసు  కుంటుందని ముఖర్జీ ఒక ప్రకటనలో తెలి  పారు. అయితే తాము జోక్యం చేసుకునేది లేనిది తాను చెప్పజాలనని ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీసే స్థాయికి కరెన్సీ కదలికలు లేకుండా చూస్తామని రిజర్వుబ్యాంకు గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు చెప్పారు. మూడు నాలుగు రోజు లుగా జరుగుతున్న పరిణామాలకు అంతర్జాతీ  య పరిస్థితులే కారణమని హైదరాబాద్‌లో ఒక సమావేశంలో మాట్లాడుతూ చెప్పారు.

దురదృష్టకరం రూపాయి పతనం వల్ల అనేక రంగాలపై తీవ్ర ప్రభావం పడుతుందని, ఇది వినాశనకరమైన మార్పు అని రిజర్వుబ్యాంకు వ్యాఖ్యానించింది. మధ్యకాలిక లక్ష్యంతో రూపాయి పతనాన్ని నిలుపు చేయడానికి ప్రయత్నిస్తామని రిజర్వు బ్యాంకు పేర్కొన్నది. మార్కెట్‌ అవసరాల ఆధారంగా రూపాయి విలువ మారుతుందని, దిగుమతి బిల్లుపై భారం పడుతుందని, ఇంధన రంగం దిగుమతులు పెరుగుతాయని రిజర్వు  బ్యాంకు పేర్కొన్నది. కంపెనీలపై పడే ప్రభావం ఆందోళన కలిగిస్తున్నదని రిజర్వుబ్యాంకు డిప్యూటీ గవర్నర్‌ సుభీర్‌గోకరణ్‌ పత్రికల వారితో అన్నారు. గత కొంత కాలంగా రూపాయి విలువ పడిపోతూనే ఉన్నది. రూపాయి విలువ పడటం వల్ల ద్రవ్యోల్బణంపై ప్రభావం ఉంటుం దని ఆయన అంగీకరించారు. ఇప్పటికే తొమ్మిది శాతంపైగా ఉన్న ద్రవ్యోల్బణంపై దీని ప్రభావం పడుతుందని చెప్పారు. మార్కెట్లో పరిస్థితి తనంతటతానే చక్కబడుతుందన్న విశ్వాసాన్ని రిజర్వుబ్యాంకు వ్యక్తం చేస్తున్నది. చమురు కంపెనీలు డాలర్లు కొనుగోలు చేయడానికి ఎగబడుతున్నాయి. 2001 జూలైతో పోలిస్తే రూపాయి విలువ 16.8 శాతం పడిపోయింది.
చర్యలు అవసరం కావచ్చు

రిజర్వుబ్యాంకు గవర్నర్‌ సుబ్బారావు హైదరా  బాద్‌లో మాట్లాడుతూ ఆహార ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉన్నందున రిజర్వుబ్యాంకు ద్రవ్య  పరమైన చర్యలు తీసుకోవాల్సి రావచ్చునని సూచనప్రాయంగాచెప్పారు.2010మార్చి నుంచి రిజర్వుబ్యాంకు కీలక వడ్డీ రేట్లను 13సార్లు పెంచింది. డిసెంబరు నాటికి ద్రవ్యోల్బణం అదుపులోకివస్తుందన్న అంచనా తప్పిపోవచ్చు.

0 comments:

Post a Comment