Friday

సువర్ణధారగణపతి

ప్రతిదినం భిక్షౌషధం భుజ్యతాం. భిక్షాటన శరీరం మీదనున్న మమకారాన్ని, మనస్సులోనున్న అహంకారాన్ని పోగొడుతుంది. ఆహారాన్ని ఔషధిని సేవిస్తున్నట్లుగా తీసుకోవాలి. శరీరంలోను, మన స్సులోను గల దోషాలను భిక్ష అనే ఔషధి పోగొడు తుంది. బ్రహ్మచర్య, సన్యాసదీక్షను స్వీకరించిన వారలకు మాత్రమే లభించే గొప్పవరం భిక్షాటన. బ్రహ్మచారి వేషంలో శంకరుడు భిక్షాటనకు బయలుదేరాడు. కౌపీనం ధరించి దండం, జల పాత్రను రెండు చేతులలోకి తీసుకొన్నాడు. గ్రామం లోని వారంతా శంకరునికొరకు ఎదురుచూస్తు న్నారు. బాలశంకరుడు ఒక పుణ్యాత్మురాలి ఇంటి ముందుకు వెళ్లి భవతి! భిక్షాందేహి అని జోలి చూపించాడు.

ఆ ఇల్లాలు శంకరుని పిలుపువిని చూడటానికి కూడా వీలులేని వస్త్రధారణతో ఉంది. తలుపుపక్కకు నిలబడి దేదీప్యమానంగా వెలిగి పోతున్న బాలశంకరుని చూసింది. పిల్లవానికి అన్నం పెట్టలేని పేదరికాన్ని తలుచుకొని దుఃఖం వచ్చింది. జీవితంలో మొదటిసారిగా తన దారిద్య్రం గురించి బాధపడింది. అతికష్టం మీద దుఃఖాన్ని దిగమింగి బ్రహ్మచారితో నాయనా! ఇంటిలో తినుటకు వస్తువులు ఏమీలేవు. క్షణకాలం ఉంటే నా పతి వచ్చినపుడు ఏమైన తినుబండారా లు తీసుకొనిరాగలరు అని దీనంగా అంది.

శంకరుడు ఆ మాట విన్నాడు. పేదరాలి ఇల్లంత ఒక్కసారి చూశాడు. ఆ ఇంట్లో జ్యేష్ఠాదేవి నివసి స్తోందని క్షణంలో అర్థమైంది. ఆ పేదరాలిమీద శంకరునికి అపారమైన జాలివేసి కారుణ్యం ఉప్పొంగింది. ఆమెచేసిన నోములు, వ్రతాలు ఫలి తంగా పూర్వజన్మ పుణ్యవశం వల్ల తన ఇంటిలో ఒక ఉసిరికాయ ఉన్నట్లు ఆమెకు గుర్తుకు వచ్చింది. వెంటనే ఆనందంతో దానికి తీసుకొని బాలశంకరుని జోలెలో వేసింది. తలుపు చాటున ఉన్న దీనురాలిని చూడకపోయినా ఆమె దారిద్య్ర దశను శంకరుడు గమనించాడు. వెంటనే శ్రీ మహా లక్ష్మిని త్రికరణశుద్ధిగా ప్రార్థించాడు ఆ బ్రాహ్మణ స్త్రీని అనుగ్రహించమని. అమ్మను 18 శ్లోకాలతో అర్థించాడు. 

అమ్మ ఎదుట కనిపించి శంకరునితో నీ కోరిక నాకు తెలిసింది. కానీ ఈ దంపతులు పూర్వజన్మలో ఎట్టి శుభకార్యాలు చేయలేదు. మంచిపనులు చేయనివారికి నా అనుగ్రహం ఎలా కలుగుతుంది? సంపదను ఏవిధంగా ఇవ్వగలను? అంది. అమ్మా, నాకిప్పుడు ఉసిరికాయను భిక్షగా ఇచ్చింది కదా! ఈ చిన్నదానాన్ని నీవు గ్రహించి బ్రాహ్మణ దంపతులను ఆశీర్వదించి అనుగ్రహించు అని లక్ష్మీదేవితో అన్నాడు. బాలవటువు మాటలకు లక్ష్మీదేవి సంతోషపడింది. ఆమె కారుణ్యపు చూపులు కనకధారగా మారిపోయాయి. ఆమె ఇల్లు, వాకిలి అంతా బంగారు ఉసిరికాయలతో నిండిపోయింది. ఆ పేదరాలు ధనవంతురాలైంది. రెండుచేతులు జోడించి బాలశంకరునికి నమస్కరిం చింది. ఆ సమయంలో బాలశంకరులు చేసిన లక్ష్మీ స్తుతిని కనకధారా స్తోత్రంగా మనకు నిత్య పారాయణ మంత్రాలుగా మారిపోయాయి.

0 comments:

Post a Comment