Friday

సాధించి తీరాలనే కోరిక వుండాలి

Much Gratitude
సాధించి తీరాలనే కోరిక వుండాలి ఉంటే ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఏదో రకంగా కృషి చేసి సాధించే మనస్తత్వం మనకుంటుంది. గాలి ఎంత అవసరం అనిపిస్తుంది, అలాగే విజయం కూడా నీకు అత్యవసరం అనిపిస్తేనే అది నిన్ను వరిస్తుంది. నేర్చుకోవటం అంటే జ్ఞాపకాలను ఏర్పరచుకోవడం, ఆ జ్ఞాపకాలను అవసరమైనప్పుడు గుర్తుకు తెచ్చుకోవటం కొన్ని విధానాలు ఎందుకు మంచి ఫలితాలు ఇస్తాయి? కొన్ని పద్దతులు ఎందుకు ఇవ్వవు? అనే వివరణ తెలుసుకుని మన పద్ధతులు మార్చుకుంటే మంచి ఫలితాలు సాధించవచ్చు. చదివిన దాన్ని వ్రాయటం, నోట్స్‌ తయారు చేయటం, దాన్ని ఒక బొమ్మలాగా వేసుకోవటం, ఇతరులకు చెప్పటం, మననం చేసుకోవటం మొదలైన చర్యలు తీసుకుంటేనే చదివిన విషయాలు దీర్ఘకాలిక మెమొరీలోకి చేరుతుంది. తాత్కాలిక జ్ఞాపకశక్తితో నమోదైన విషయం ఆ క్షణాన నూటికి నూరుపాళ్ళు గుర్తుంటుంది. ఆ విషయాన్ని తిరిగి పట్టించుకోకుండా, ఆలోచించకుండా దీర్ఘకాలిక జ్ఞాపకశక్తిలో నమోదయ్యేలా ఏ పనీ చేయకపోతే క్రమక్రమంగా పూర్తిగా మర్చిపోతాం. అంతర్గతంగా వినటం, ఫీల్‌ కావటం ద్వారా బ్రెయిన్‌ బాగా గుర్తుంచుకుంటుంది. ఒక్కొక్కరు ఒకొక్క విధానానికి అలవాటు పడుతారు. పునఃశ్చరణ చేసుకునే టప్పుడు వీలైనన్ని ఎక్కువ మార్గాల ద్వారా చేసుకోవాలి. తెలివి తేటలను ప్రేరేపిస్తు నేర్చుకోవాలి. దీనివలన నేర్చుకునే విషయం, దీర్ఘకాలిక జ్ఞాపకశక్తిలో నమోదు కావటమే కాక అతి వేగంగా గుర్తుకు తెచ్చుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. వీటన్నింటి తో పాటు సాధించి తీరాలనే కాన్ఫిడెంట్‌ వుంటే త్వరగా దేనినైనా సాధించగలము.

0 comments:

Post a Comment