Friday

మానవుడు సంఘజీవి

paki0008-3b.jpg
మానవుడు సంఘ జీవి. సంఘంలో తనతో పాటు జీవించే మానవులతో కలిసి మెలిసి జీవిస్తాడు. తన జీవన అవసరాలకు ఇతరులపై ఆధారపడతాడు. ఆ అవసరాలు తీర్చే వ్యక్తితో అనుబంధాన్ని పెంచు కుంటాడు. తనకేవిధంగా ఇతరులు సహాయ పడుతుంటారో తాను అదే విధంగా ఇతరులకు సహాయ పడు తుంటాడు. తాను ఎవరికి సహాయ పడుతుంటాడో వారితో కూడా అతనికి అనుబంధం ఉంటుంది. ఈ అనుబంధం మానవుని జీవితం సుఖమయం చేస్తుంది. మానవుడు బుద్దిజీవి, తెలివితేటలుగల వాడు. ఇతరులు సాధించిన విజ్ఞానాన్ని పుస్తకాల ద్వారా చదివి ఉపన్యాసాల ద్వారా విని తను సొంతం చేసు కుంటాడు. తనకు తెలియని విజయాలను గురువుల ద్వారా, పెద్దల ద్వారా తెలుసుకుంటాడు. అనుమా నాలుంటే నివృత్తి చేసుకుంటాడు. ఈ పునాదులపై మరికొన్ని వినూత్న విషయాలను కనుక్కొంటూ తన భవిష్యత్తును అందంగా, అత్యున్నతంగా తీర్చిదిద్దుకుంటాడు. పుస్తకాలతో గాని, గురువులతో గాని, పెద్దలతో గాని ఆ అనుబంధాన్ని ఏర్పరచుకోలేని వ్యక్తి విషయ సేకరణ చేయలేడు. అనుమా నాలు తీర్చుకోలేడు. సందేహాలుంటే తనలోనే ఇముడ్చుకొని తనకు చేతకాదని, తాను అసమర్థుడన భావిస్తూ ఉంటాయి. మానవుడు హృదయ జీవి. అతని హృదయం నిండా ప్రేమ నిండి వుంటుంది. అతడు తన తల్లిదండ్రులను ప్రేమిస్తాడు. అన్నదమ్మలను, అక్కచెల్లెళ్ళను ప్రేమిస్తాడు. భార్యాబిడ్డలను ప్రేమిస్తాడు. బంధువు లను, స్నేహితులను ప్రేమిస్తాడు. అలాగే వారందరి నుండి ప్రేమను పొందటానికి అనుబంధం పెంచు కుంటాడు. ఈ అనుబంధం అతడికి ప్రేమైన జీవిగా మారుస్తుంది. ఈ అనుబంధం అతనిలో అభిమానాని,్న అనురాగాన్ని కలిగిస్తుంది. దానితో అతని దృష్టి విశాలమవుతుంది. అతడు తన కుటుంబాన్ని, స్నేహితుల నే కాదు తన గ్రామాన్ని తన రాష్ట్రాన్ని, దేశాన్ని ప్రేమిస్తాడు. అతని జీవితం ప్రేమతో పునీతమవుతుంది.

0 comments:

Post a Comment