Thursday

కంటి చూపుతో ఇంటర్నెట్



లండన్, నవంబర్ 22: సాంకేతిక విప్లవం కొత్త పుంతలు తొక్కుతోంది. ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న సెల్ ఫోన్ చూస్తేనే అమ్మో.. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందింది అనుకుంటున్నారా?.. మరి కళ్లకు పెట్టుకునే కాం టాక్ట్ లెన్స్‌కు ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే ఏమనుకుంటారు.. ఇది కేవలం ఊహాజనితం అనుకుంటున్నారా.. అయితే అటువంటి ఊహలను కూడా నిజం చేయొచ్చంటున్నారు శాస్త్రవేత్తలు. ఇంటర్నెట్ కనెక్షన్‌తో ఉన్న కాంటాక్ట్ లెన్స్‌ను తయారు చేసే ప్రక్రియలో మరో అడుగు ముందుకేశామని అంతర్జాతీయ పరిశోధకుల బృందం ప్రకటించింది.

అమెరికాలోని వాషింగ్టన్ యూనివర్సిటీ, ఫిన్‌లాండ్‌లోని అల్టో యూనివర్సిటీ పరిశోధకులతో కూడిన బృందం దీనిపై ప్రయోగాలు నిర్వహించింది. చేతులు ఉపయోగించవలసిన అవసరం లేకుండానే మెయిల్స్ చదువుకునే ప్రోటోటైప్ కాంటాక్ట్ లెన్స్‌ను తయారు చేశామని పరిశోధకులు ప్రకటించారు. సాధారణంగా కంటికి కనీస దూ రంలో లేని వాటిని గుర్తించలేము. శాస్త్రవేత్తలు విస్తృతంగా పరిశోధనలు జరిపి అతి సన్నని కాంటాక్ట్ లెన్స్ ఉపయోగించడం ద్వారా ఈ సమస్యను అధిగమించారు. ఇటువంటి కాంటాక్ట్ లెన్స్‌ను ఉపయోగించడం వల్ల ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని హామీ ఇస్తున్నారు.

0 comments:

Post a Comment