వాషింగ్టన్, నవంబర్ 22: ఇరాన్‌పై పాశ్చాత్య దేశాలు మరిన్ని ఆంక్షలు విధించాయి. అమెరికా, బ్రి టన్, కెనడా దేశాలు ఇరాన్‌ను టార్గెట్ చేశాయి. ఇరాన్‌ను ఒంటరి చేయడమే తమ లక్ష్యంగా పలు చర్యలను తీసుకుంటున్నాయి. ఇరాన్‌లోని పెట్రో కెమికల్ పరిశ్రమలు, ఆయిల్ మరియు గ్యాస్ వ్యాపారాలపై ప్రభావం పడేలా ఆంక్షలను విధించాయి. ఇందుకు సంబంధించి సోమవారం అమెరికా అధ్యక్షుడు ఒబామా ఆదేశాలు జారీ చేశారు. అయితే.. ఇరాన్‌పై పాశ్చాత్య దేశాల ఆంక్షలను చైనా, రష్యా వ్యతిరేకిసున్నాయి.
కాగా, ఇరాన్‌లో మానవ హక్కులు మంటగలుస్తున్నాయని.. ప్రజలకు స్వేచ్ఛ లేదని.. హింసా ప్రవృత్తి రోజురోజుకు ఎక్కువవుతోందని ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీ ఎండగట్టింది. ఈ మేరకు సోమవారం ఇరాన్‌ను వ్యతిరేకిస్తూ తీర్మానాన్ని ఆమోదించింది. మరోవైపు ఉత్తర కొరియా, మయన్మార్ దేశాల్లో కూడా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించింది.

0 comments:
Post a Comment