Tuesday

సుపరిపాలనకు ఢాకా విభజన బంగ్లాదేశ్ పార్లమెంటు ఆమోదం


ప్రతిపక్షం నుంచి ఎంతగా విమర్శలు వచ్చినా.. ప్రజలకు సత్వర సేవలందించేందుకు రాజధాని ఢాకా నగర పాలక సంస్థను రెండుగా విభజించే బిల్లుని బంగ్లాదేశ్ పార్లమెంటు మంగళవారం ఆమోదించింది. మూజువాణి ఓటుతో ఈ బిల్లును సభ ఆమోదించిన సమయంలో అధికారపక్షం ఆవామీలీగ్ సభ్యులు మాత్రమే ఉన్నారు.

ఢాకా నగరాన్ని విభజించే స్థానిక ప్రభుత్వం(నగరపాలకసంస్థ సవరణ) బిల్లు 2011లో నగర విభజన తరువాత 90రోజుల్లో ఎన్నికలు జరపాలని స్పష్టం చేశారు. జనాభా కోటికిపైగా దాటిన స్థితిలో ఢాకావాసులకు ఒక్క నగర పాలకసంస్థయే సేవలందించడం క్లిష్టంగా మారిందని ప్రభుత్వం పేర్కొంది. ఈ బిల్లును వ్యతిరేకించిన ప్రతిపక్షం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్‌పీ) పార్లమెంటును బహిష్కరించింది.

0 comments:

Post a Comment