Tuesday

అమెరికాకు పాక్ హుకుం షంసి ఎయిర్‌బస్‌ను తక్షణమే వీడండి 15 రోజులే వ్యవధి.. ఐరాస చీఫ్‌కు లేఖ దర్యాప్తునకుఅమెరికా నిర్ణయం


the_duelpakistan_vs-america
నాటో దళాల దాడి దరిమిలా ఆగ్రహంతో ఊగిపోతున్న పాకిస్థాన్.. అమెరికాకు హకుం జారీచేసింది. తక్షణమే తమ గడ్డను వీడి వెళ్లాలంటూ హెచ్చరించింది. 15 రోజుల్లోగా షంసి వైమానిక స్థావరాన్ని ఖాళీ చేయాలని అల్టిమేటం జారీచేసింది. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి(ఐరాస) దృష్టికి తీసుకెళ్లింది. ఈ మేరకు ఐరాసలో పాక్ రాయబారి అబ్దుల్లా హుస్సేన్ హరూన్.. ఐరాస సెక్రటరీ జనరల్ బాన్ కి మూన్‌కు ఓ లేఖ రాశారు. నాటో దళాల దాడిని పాక్ తీవ్రంగా నిరసించింది.

అంతే కాదు.. బాన్ సదస్సును బహిష్కరించాలని కూడా పాక్ మంత్రివర్గం నిర్ణయించింది. నాటో దళాల దాడిపై చర్చించేందుకు పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ప్రధాని యూసుఫ్ రజా గిలానీ కోరారు. షంసి ఎయిర్‌బేస్‌ను ఖాళీ చేయడంతోపాటు అప్ఘానిస్థాన్‌కు నాటో ప్రధాన సరఫరా మార్గాలు రెండిం టిని మూసేయాలని పాక్ కోరుతోంది. షంసి ఎయిర్‌బేస్ ను వీడేందుకు పాక్ ప్రభుత్వం పెట్టిన 15 రోజుల గడువును పొడిగించాలన్న అభ్యర్థనను పాక్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ తోసిపుచ్చారు. 
గడువు పెంపు అభ్యర్థన యూఏఈ విదేశాంగ శాఖ నుంచి వచ్చినట్టు వార్తలందాయి. బలూచిస్థాన్‌లో ఉన్న ఈ ఎయిర్‌బేస్ 1990 నుంచి యూఏఈ నియంత్రణలోనే ఉంది. ఎమిరేట్స్ రాజకుటుంబాల సభ్యుల కోసం పాకిస్థాన్ ఈ ఎయిర్‌బేస్ ను లీజుపై యూఏఈకి అప్పగించింది. కాగా మరోవైపు నాటో దాడిపై దర్యాప్తునకు అమెరికా చర్యలు చేపట్టింది. ఈ బాధ్యతలను ఉన్నతస్థాయి సైనికాధికారికి అప్పగించింది. పాకిస్థాన్ సరిహద్దు పోస్టులపై గత వారం నాటో దళాలు జరిపిన దాడిలో 24 మంది సైనికులు మృతి చెందిన విషయం తెలిసిందే. 


దీనిపై పాక్‌లో ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. దీంతో ఫ్లోరిడాలోని అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రధాన కార్యాలయానికి చెందిన బ్రిగేడియర్ జనరల్ స్టీఫెన్ క్లార్క్‌ను ఈ ఘటనపై దర్యాప్తు చేయాల్సిందిగా అమెరికా ఆదేశించింది. వచ్చే నెల 23లోగా నివేదిక అందజేయాలని క్లార్క్‌కు సూచించింది. ఈ దర్యాప్తులో పాలు పంచుకోవాల్సిందిగా పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్‌లనూ కోరింది. అయితే నాటో దాడి పొరపాటున జరిగిందేనని అమెరికా భావిస్తోంది.

0 comments:

Post a Comment