Tuesday

పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ కసరత్తు గ్రూప్-1 పోస్టుల సంఖ్య 310కి పెరిగే అవకాశం



Andhra Pradesh Public Service Commission
7 వేలకు పైగా పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ పచ్చజెండా
డిపార్ట్‌మెంట్ టెస్టుల్లో సంస్కరణలకు శ్రీకారం
భవిష్యత్తులో ఏడాదికి 3 సార్లు పరీక్షల నిర్వహణ
హైదరాబాద్, నవంబర్ 29 : దీర్ఘకాలంగా వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) కసరత్తు ప్రారంభించింది. గ్రూప్-1 సర్వీసెస్ కొత్త నోటిఫికేషన్‌తో జాబ్ మేళాకు శ్రీకారం చుట్టింది. గ్రూప్-1 పోస్టుల సంఖ్య 310కి పెరిగే అవకాశం ఉంది. డిసెంబర్‌లో గ్రూప్-2, గ్రూప్-4, డిగ్రీ లెక్చరర్స్, జూనియర్ లెక్చరర్స్, పాలిటెక్నిక్ లెక్చరర్స్.. తదితర నోటిఫికేషన్ల పర్వాన్ని కొనసాగించనుంది. ఏపీపీఎస్సీ ద్వారా దాదాపు 20 వేల వరకు పోస్టులను భర్తీ చేయాలని సర్కారు భావిస్తున్నా ఇప్పటికి 7 వేలకు పైగా పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇందులో ఏపీపీఎస్సీకి అందిన 5,725 పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి. 
AA

గ్రూప్-2 సర్వీసెస్ పరిధిలోకి వచ్చే పోస్టులు (1916): హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ (సోషల్ వెల్ఫేర్) -522 పోస్టులు, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్(ట్రైబల్ వెల్ఫేర్) -289, ఏఎస్‌డబ్ల్యుఓ-24, జూనియర్ అసిస్టెంట్లు/జూనియర్ అసిస్టెంట్లు కమ్ టైపిస్టులు (సివిల్ సప్లయిస్)-30, జూనియర్ అసిస్టెంట్లు(టెక్నికల్ ఎడ్యుకేషన్)-27, జూనియర్ అసిస్టెంట్లు (ఇంటర్ బోర్డు)-50, జూనియర్ అసిస్టెంట్లు (వైద్య విధాన పరిషత్)-102, జూనియర్ అసిస్టెంట్లు(డి.జి. ప్రిజన్స్)-81 , జూనియర్ అసిస్టెంటు (కమిషనర్ ఆఫ్ లేబర్)-28, జూనియర్ అసిస్టెంట్లు (డి.జి.ఫైర్ సర్వీసెస్)-7, జూనియర్ అసిస్టెంట్లు(ప్రిన్సిపల్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్)-73 పోస్టులు, జూనియర్ అసిస్టెంట్లు(ఇంజనీర్ ఇన్ చీఫ్)-6, జూనియర్ అసిస్టెంట్లు (ఏపీపీఎస్సీ)-46, జూనియర్ అసిస్టెంట్లు(ట్రెజరీస్)-118, జూనియర్ అసిస్టెంట్లు(కమిషనర్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్)-17, జూనియర్ అసిస్టెం ట్లు(కమిషనర్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్)-22, జూనియర్ అసిస్టెంట్లు (ఇంజనీర్ ఇన్ చీఫ్-పబ్లిక్ హెల్త్)-6, జూనియర్ అసిస్టెంట్లు (ఈఓ-పీఆర్ అండ్ ఆర్‌డీ)-91, జూనియర్ అకౌంటెంట్స్ (మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్)-136, సీనియర్ అకౌంటెంట్స్(మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్)-124, అకౌంట్స్ ఆఫీసర్స్(మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్)-16, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్స్(మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్)-50, జూనియర్ అసిస్టెంట్స్ (ట్రైబల్ వెల్ఫేర్)-21పోస్టులు . గ్రూప్-4 సర్వీసెస్ పరిధిలోకి వచ్చే పోస్టులు (1012): బిల్ కలెక్టర్స్-45 పోస్టులు, జూనియర్ అసిస్టెంట్స్ (సీసీఎల్ ఏ)-952 పోస్టులు, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్స్(ట్రైబల్)-15 పోస్టులు.

ఇతర పోస్టులు (2493): డిగ్రీ లెక్చరర్స్ -321పోస్టులు, పాలిటెక్నిక్ లెక్చరర్స్-139 పోస్టులు, లైబ్రేరియన్స్-21 పోస్టు లు, ఫిజికల్ డైరెక్టర్స్-12 పోస్టులు, అసిస్టెంట్/అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ (పీఆర్,ఆర్‌డబ్ల్యూఎస్, ఆర్ అండ్ బీ, ఇరిగేషన్ విభాగాలు)- సుమారు 2000 పోస్టులు.

గ్రూప్-1 కొత్త నోటిఫికేషన్‌కు సంబంధించిన పోస్టుల(304) వివరాలు
1 డిప్యూటీ కలెక్టర్స్ (ఏపీ సివిల్ సర్వీస్ -ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్) 07
2 కమర్షియల్ టాక్స్ ఆఫీసర్స్ (ఏపీ కమర్షియల్ టాక్సెస్ సర్వీస్) 01
3 డిప్యూటీ రిజిస్ట్రార్స్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ (ఏపీ కోఆపరేటివ్ సర్వీస్) 15
4 డీఎస్‌పీ (సివిల్)క్యాట్-2 (ఏపీ పోలీస్ సర్వీస్) 05
5 డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ (ఏపీ జైల్స్ సర్వీస్- మెన్) 04
6 డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్స్ (ఏపీ రిజిస్ట్రేసన్ అండ్ స్టాంప్స్ - ఏపీ రిజిస్ట్రేషన్ సర్వీస్) 05
7 డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ (ఏపీ ట్రెబల్ సర్వీస్) 04
8 డిస్ట్రిక్ట్ ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ ( ఏపీ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ సర్వీస్) 23
9 డివిజినల్ ఫైర్ ఆఫీసర్స్ (ఏపీ ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీస్) 10
10 ఏటీఓ/ఏఏఓ (ఏపీ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ సర్వీస్ ) 10
11 రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్ (ఏపీ ట్రాన్స్‌పోర్టు సర్వీస్) 06
12 మున్సిపల్ కమిషనర్స్ గ్రేడ్-2 (ఏపీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్) 03
13 డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్ (ఏపీ పంచాయత్ రాజ్ సర్వీస్) 11
14 డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ (ఏపీ సోషల్ వెల్ఫేర్ సర్వీస్) 07
15 డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ (ఏపీ బీసీ వెల్ఫేర్ సర్వీస్) 04
16 లే సెక్రెటరీ/అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (ఏపీ మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్) 02
17 అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ 04
18 అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్స్ (ఏపీ ఆడిట్ సర్వీస్) 64
19 ఎంపీడీఓ (ఏపీ పంచాయత్ రాజ్ రూరల్ ఎంప్లాయిమెంట్ సర్వీస్) 119

మొత్తం 304

0 comments:

Post a Comment