Tuesday

ప్రమాదకరంగా భూతాపం ప్రపంచ సగటు 2 డిగ్రీలు పెరిగే ముప్పు


Average Temparature January 

వాతావరణంలో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ప్రకృతి వైపరీత్యాలు సర్వసాధారణంగా మారాయి. మానవ ప్రేరేపిత కాలుష్యంతో భూతాపం పెరగడమే ఇందుకు కారణమని ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) అంటోంది. దీనివల్ల ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు ప్రమాదకర స్థాయిలో రెండు డిగ్రీలు హెచ్చనున్నాయని అంచనా వేసింది. ఈ ఏడాది ప్రపంచ ఉష్ణోగ్రతలు అత్యధిక స్థాయికి చేరాయని, 2011 అత్యధిక వేడి నమోదైన సంవత్సరంగా చరిత్రలో పదో స్థానంలో నిలిచిందని ఆ సంస్థ వెల్లడించింది.

ఈమేరకు ప్రపంచ వాతావరణ పరిస్థితిపై వార్షిక నివేదికను డబ్ల్యూఎంఓ విడుదలచేసింది. 'లా నినా' వాతావరణ చర్య వల్ల ఈ ఏడాది ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరిగాయని తెలిపింది. ఆర్కిటిక్‌లో మంచు పరిమాణం అత్యల్ప స్థాయికి చేరిందని, ఈ విషయంలో 2011 సంవత్సరం చరిత్రలో రెండో స్థానంలో ఉందని వెల్లడించింది. అక్కడి మంచు మొత్తం త్వరలోనే మాయం కానుంది.

గత 15ఏళ్లలోనే 13 అత్యధిక ఉష్ణోగ్రతలు రికార్డయిన సంవత్సరాలు నమోదయ్యాయని నివేదిక పేర్కొంది. వాతావరణంలో పేరుకుపోతున్న గ్రీన్‌హౌజ్ వాయువుల వల్ల భూ వాతావరణం, జీవావరణం, సముద్రాల్లో తీవ్ర పరిణామాలు చోటుచేసుకునే ప్రమాదముందని హెచ్చరించింది. వాతావరణ మార్పుల వల్ల ఈ ఏడాది పాకిస్థాన్, థాయిలాండ్, మయన్మార్, అమెరికా దేశాలు ఎక్కువగా ప్రభావితమైనట్లు డబ్ల్యూఎంఓ తెలిపింది. తుపానులు, వరదలు, అధికవర్షాలు, కరువుతో అనేక దేశాలు అల్లాడాయని పేర్కొంది

0 comments:

Post a Comment