జెయింట్ వీల్. ఈ పేరు వింటే చాలు ఎవరికైనా ఒక్కసారిగా సంతోషం, ఆ వెంటనే భయం గుర్తొస్తుంది. వీల్ ఎక్కి తిరుగుతుంటే హ్యాపీగా ఉన్నా అంత ఎత్తులో మనం ఉండటంతో గుండె గుబగుబలాడుతుంది. మామూలు జెయింట్ వీల్స్ పరిస్థితే ఇలా ఉంటే, ఇక ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వీల్ ఎక్కితే సీన్ ఎలా ఉంటుంది ? ఊహించుకుంటున్నారా ? రష్యాలో ఇలాంటిదే ఓ అబ్జర్వేషన్ వీల్ నిర్మిస్తున్నారు. దాని విశేషాలు మీ కోసం. స్టార్ట్ విత్ స్పాట్...ఎగ్జిబిషన్లు, పండుగ సమయాల్లో జెయింట్ వీల్ ఏర్పాటు చేయడం సర్వసాధారణంగా మారిపోయింది. గుండ్రంగా తిరిగే ఈ వీల్ ఎక్కి తిరగాలని పిల్లలు మొదలు పెద్ద వాళ్ల వరకు కోరిక ఉంటుంది.
కానీ, ఈ వీల్ చాలా ఎత్తుకు వెళ్లి తిరిగి వచ్చేది కావడంతో చాలా మంది భయపడతారు. వీల్ ఎక్కిన వాళ్ల కొందరు భయంతో గజగజలాడతారు. ఇప్పుడు మనం చెప్పుకున్నవి అన్నీ చిన్నా, చితకా జెయింట్ వీల్స్. కానీ, వరల్డ్‌లోనే అత్యంత ఎత్తైన వీల్‌ను మాస్కోలో ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. 722 అడుగులతో దీన్ని తయారు చేయనున్నారు. జెయింట్ వీల్‌తోపాటు ఇక్కడకు వచ్చే సందర్శకుల కోసం రెస్టారెంట్లు, షాపింగ్ కాంప్లెక్స్, గ్యాలరీలు, థియేటర్లు నిర్మించనున్నారు. ఫెర్రీస్ వీల్ పేరుతో నిర్మించనున్న ఈ ప్రాజెక్టుకు సుమారు 15వందల కోట్ల రూపాయలు ఖర్చవుతాయని అంచనా.
అయితే, ఇంత భారీ వీల్‌ను ఎక్కడ నిర్మించాలనే అంశాన్ని రష్యా ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఫెర్రీస్ వీల్ అందుబాటులోకి వస్తే ఇప్పటివరకు టాప్ వీల్స్‌గా ఉన్న సింగపూర్, లండన్ వీల్స్ రికార్డులు కనుమరుగు కావడం ఖాయం. మరోవైపు, జెయింట్ వీల్‌తో మాస్కో టూరిజం మరింత పెరుగుతుందని రష్యా ప్రభుత్వం భావిస్తోంది.

0 comments:
Post a Comment