Sunday

టాన్సిలైటీస్‌ సమస్యకు శస్త్ర చికిత్సే మార్గమా..?

టాన్సిల్స్‌ అనేవి గొంతులో ఇరు పక్కల ఉండి మన శరీరానికి రక్షకభటు లుగా పనిచేస్తాయి. బయట నుండి వచ్చే సూక్ష్మక్రిములను, కాలుష్య కారక పదార్థాలను శరీరంలోకి రాకుండా నివారించటంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఇంతగా ఉపయోగపడుతున్న టాన్సిల్స్‌ను శస్తచ్రికిత్స చేసి తొలగించకుండా సమస్య వచ్చినప్పుడు హోమియో మందులను వాడి శస్త్ర చికిత్స లేకుండానే సమస్య నుండి విముక్తి పొంది టాన్సిల్స్‌ సైజు కూడా పెరగకుండా చేసుకోవచ్చు.

ఈ సీజన్‌లో చాలా మంది చిన్న పిల్లలు ఈ సమస్యతో బాధపడుతుంటారు. టాన్సిల్స్‌ సైజు పెరిగి వాపు (టాన్సిలెైటిస్‌) రావడం వలన గొంతునొప్పి, జ్వరంతో బాధపడుతుంటారు. గొంతులో ఇన్‌ఫెక్షన్‌ కారక సూక్ష్మక్రిములు ఎక్కువ కావడం వలన టాన్సిల్స్‌ ఇన్‌ఫెక్షన్‌కు గురెై గొంతునొప్పి మొదలవుతుంది. అలాగే చల్లటి పానీయాలు, చల్లటి తేమ గాలి సరిపడకపోవడం వల్ల టాన్సిల్స్‌ సమస్య వేధిస్తుంది.

లక్షణాలు:
టాన్సిల్స్‌ ఎరగ్రా వాపుగా కన్పిస్తాయి. గొంతునొప్పి, చెవినొప్పి, తలనొప్పి జలుబుతో జ్వరం 101 డిగ్రీల నుండి 103 డిగ్రీల ఫారన్‌హీట్‌ల వరకు ఉంటుంది. ఆహారం మింగటం, నీరు తాగటం, గాలి పీల్చడం, బాగా మాట్లాడటం కష్టంగా మారుతుంది. నోరు బొంగురు పోవడం, గొంతు తడారిపోయి గొంతు ఎరబ్రడడం, నోరు దుర్వాసన వస్తుంది. నీరసం, చికాకు వంటి లక్షణాలుంటాయి.
జాగ్రత్తలు:
చల్లటి గాలిలో తిరుగకూడదు. కలుషిత నీటిని తాగకుండా, కాచి వడపోసిన నీటిని తీసుకోవడం వలన వ్యాధి తీవ్రత పెరగకుండా ఉంటుంది. చల్లటి పానీయాలను, ఐస్‌క్రీములు, బేకరీ ఫుడ్స్‌ తీసుకోకూడదు. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు చన్నీళ్ల స్నానం చేయకూడదు. వ్యాధి తీవ్రత హెచ్చుగా ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే చికిత్స తీసుకోవాలి.
చికిత్స:
టాన్సిలెైటీస్‌కు ఎక్కువశాతం వరకు శస్తచ్రికిత్స అవసరం లేకుండానే టాన్సిల్స్‌ సమస్యను నివారించే మంచి చికిత్స హోమియోవెైద్యంలో కలదు. వ్యాధి లక్షణాలను మరియు వ్యక్తి మానసిక, శారీరక లక్షణాలను, పరిగణలోకి తీసుకొని మందులను ఎన్నుకొని వెైద్యం చేస్తే టాన్సిలెైటీస్‌ సమస్య నుండి విముక్తి పొందవచ్చు.
మందులు:
F3sహెపార్‌సల్ఫ్‌: టాన్సిల్స్‌ సైజు పెరిగి గొంతు నొప్పి చల్లగాలి సోకగానే మొదలగును. వీరికి నొప్పితో బాటు గొంతులో ఉండబెట్టినట్లుగా, టాన్సిల్స్‌లో చీముతో పాటుగా తీవ్ర జ్వరం ఉంటుంది. గొంతులో ముల్లు గుచ్చుతున్నట్లుగా అనిపించి మింగినప్పుడు విపరీతమైన నొప్పి గమనించ దగిన ప్రత్యేక లక్షణం. వీరికి చల్లదనం గిట్టదు, వేడి పదార్థాలు తీసుకుంటే బాగా అనిపిస్తుంది. ఇలాంటి లక్షణాలు ఉన్న వారికి ఈ మందు ప్రధానమైనది.
బెరెైటాకార్బ్‌: టాన్సిల్స్‌ సమస్య వలన ప్రధానంగా పిల్లల్లో ఎదుగుదల లోపించినట్లు అయితే ఈ మందును వాడుకొని ప్రయోజనం పొందవచ్చు.
బెల్లడోనా: టాన్సిల్స్‌ వాపుతో పాటు గొంతునొప్పి, జ్వరం అకస్మాత్తుగా మొదలవుతుంది. గొంతునొప్పి కుడివెైపు ఎక్కువగా ఉంటుంది. గొంతు పొడారిపోయి మింగటం కష్టంగా మారుతుంది. గొంతులో ఎరబ్రారి ఉంటుంది. వీరికి స్నానం చేసిన అనంతరం బాధలు ఎక్కువవుతాయి. ఇటువంటి లక్షణాలు ఉన్న వారికి ఈ మందు ప్రయోజనకారి.
ఎకోనెైట్‌: చల్లగాలిలో తిరగడం వలన టాన్సిల్స్‌ సైజు పెరిగి గొంతు నొప్పి వెంటనే ప్రారంభమవుతుంది. ఇలాంటి కారణంగా గొంతునొప్పి ప్రారంభమయి, మింగటం కష్టంగా మారి గొంతు మంటమండుతుంది. దాహం విపరీతంగా ఉండి జ్వరంతో బాధపడుతుంటారు. ఇలాంటి లక్షణాలు ఉన్న వారికి ఈ మందు ఆలోచించదగినది.
మెర్కుసాల్‌:టాన్సిల్స్‌ ఇన్‌ఫెక్షన్‌కు గురెై సైజు పెరిగి గొంతునొప్పి మొదలవుతుంది. గొంతు నొప్పి రాత్రి సమయంలో ఎక్కువగా ఉంటుంది. నోరు దుర్వాసన కొడుతుంది, నాలుక పెద్దదెై నాలుక చివర పళ్ల అచ్చులు కనబడటం ఈ మందు ప్రత్యేక లక్షణం. వీరికి జలుబు చేసినప్పుడు గొంతు నొప్పితో బాధపడుతుంటారు. జ్వరంతో పాటుగా చెమటలు ఎక్కువగా ఉంటాయి. ఇటువంటి లక్షణాలు ఉన్న వారికి ఈ మందు ఆలోచించదగినది.
జెల్సిమియం: వెైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ మూలంగా వచ్చే టాన్సిలెైటీస్‌కు ఈ మందు బాగా పని చేయును. టాన్సిల్స్‌ ఇన్‌ఫెక్షన్‌కు గురెై సైజు పెరిగి గొంతునొప్పి మొదలవుతుంది. గొంతు నొప్పి మూలంగా ద్రవ పదార్థాలు సైతం మింగడం కష్టమవుతుంది. జ్వరంతో నీరసంగా, అస్తిమితంగా ఉంటారు. ఇలాంటి లక్షణాలు ఉన్న వారికి ఈ మందు వాడి ప్రయోజనం పొందవచ్చు.
ఈ మందులే కాకుండా ఫెర్రంఫాస్‌, సైలీషియా, బెరెైటామోర్‌, కాలిమోర్‌, మెగ్‌ఫాస్‌, లేకసిస్‌, కాల్కేరియా కార్బ్‌, సల్ఫర్‌, ఎపిస్‌ వంటి మందులను లక్షణ సముదాయమును బట్టి డాక్టర్‌ సలహా మేర కు వాడుకుని టాన్సిలెైటిస్‌ సమస్య నుండి విముక్తి పొందవచ్చు.

0 comments:

Post a Comment