శబ్దవేగాన్ని జయిస్తూ...ఎన్నో రెట్లు మించిన వేగం...లక్ష్య ఛేదనకు దిగిం దంటే విదేశీ రాడార్ల పాలిట సింహస్వప్నం...అగ్రదేశం అమ్ముల పొదిలోని అత్యున్నత యుద్ధ విమానస్థాయి! దాదాపు దశాబ్దం తర్వాత అందుబాటులోకి వస్తుందంటేనే పక్కదేశాల్లో ఇప్పుడే కలవరపాటు! శత్రుదేశాల పీచమణచడానికి బడ్జెట్ పరిమితులు మరచి మన దేశం సమకూర్చుకుంటున్న యుద్ధవిమానం ‘ఎఫ్‌జీఎఫ్‌ఏ’. చిరకాల నేస్తం రష్యా ‘సుఖోయ్’ యుద్ధ విమాన కర్మాగారంలో భారత టెక్నాలజీ, రష్యా నిపుణులతో ఈ ఐదోతరం యుద్ధవిమానం రూపొందుతోంది. పదేళ్లలో భారత అమ్ముల పొదిలో ఒదగనుంది!
రెండేళ్లలో తొలి నమూనా...
ఈ అధునాతన ఎయిర్‌ఫైటర్‌కు సంబంధించి తొలి నమూనాను 2014 కల్లా భారత గగన వీధుల్లో విహరింపజేయడానికి సర్వం సిద్ధం అవుతోంది. దశల వారీగా 2017, 19లలో అభివృద్ధి పరచిన నమూనాలు పరీక్షించి 2022 నాటికల్ల్లా భారత వైమానిక దళానికి అందించనున్నారు.
బడ్జెట్‌పై ఆలోచించని భారత్!
ఇప్పటి వరకూ సుఖోయ్ -30 ఎమ్‌కేఐను ఉన్నతస్థాయి యుద్ధవిమానంగా కలిగి ఉన్న భారత్ ఎఫ్‌జీఎఫ్‌ఏ కు సంబంధించి రాడార్లకు దొరకని సామర్థ్యం(స్టెల్త్) విషయంలో దూకుడు ప్రదర్శిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. ఆ సామర్థ్యంతో కూడిన యుద్ధవిమానం కోసం భారత్ బడ్జెట్ కేటాయింపుల్లో రాజీ పడలేదంటున్నారు. దీని రూపకల్పన అధ్యయనం కోసమే 11 బిలియన్ డాలర్ల సొమ్మును ఖర్చు చేయనున్నారు. 2022 నాటికి భారత వాయుదళంలోకి ఎఫ్‌జీఎఫ్‌ఏ చేర్చగలమని ఐఏఎఫ్ చీఫ్ మార్షల్ ఎన్‌ఏకే బ్రోనే పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ఆయన త్వరలో రష్యాలో పర్యటించి సుఖోయ్ డిజైన్ బ్యూరోతో సమావేశం అయ్యి ఎఫ్‌జీఎఫ్‌ఏ రూపకల్పనలో ప్రగతిని సమీక్షిస్తారు.
ప్రపంచంలోనే గ్రేటెస్ట్ ఎయిర్‌ఫైటర్...
అమెరికా అత్యాధునిక యుద్ధ విమానం ఎఫ్-22 కి దీటు భారత్-రష్యాల ఎఫ్‌జీఎఫ్‌ఏ. వివిధ దేశాల వద్దనున్న యుద్ధవిమానాల్లోకెల్ల్లా అత్యాధునిక సాంకేతికతను సంతరించుకొన్న యుద్ధవిమానంగా ఎఫ్‌జీఎఫ్‌ఏ నిలవనుంది.
మనకు లాభాలివీ..
రష్యా ‘సుఖోయ్’ రూపకర్తల ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి నిపుణులతో పనిచేసే అవకాశం మన డిజైనర్‌లకు, టెక్నీషియన్లకు లభిస్తుంది.
దేశీయంగా ఎయిర్‌క్రాఫ్ట్ ఉత్పాదకత సామర్థ్యం పెంపుదల, భవిష్యత్తులో ఇటువంటి విమానాలను సొంతంగా రూపొందించుకోగల సామర్థ్యం.
దాదాపు ఇటువంటి ప్రయోజనాలనే రష్యా కూడా పొందుతుంది. భారీ సంఖ్యలో యుద్ధవిమానాలను కొనుగోలు చేయగల నమ్మకమైన నేస్తంగా భారత్‌ను భావిస్తూ, తన ఖర్చులను కూడా తగ్గించుకొనే పనిలోఉంది రష్యా.
అమెరికాకే పోటీ !
ఎఫ్‌జీఎఫ్‌ఏ కు సంబంధించి రష్యా ఇప్పటికే మూడు నమూనాలను పరీక్ష దశలో పెట్టుకొంది. వాటిని పరిశీలించిన భారత్ అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది! రష్యా డిజైన్‌లో 30 శాతం మార్పులు చేయించి(ప్రత్యేకించి స్టెల్త్ విషయంలో) సామర్థ్యం పెంచుకోవాలని భారత్ భావిస్తోంది. ఒక అమెరికన్ విశ్లేషకుడి ప్రకారం...రష్యా ఎఫ్‌జీఎఫ్‌ఏల కన్నా, చైనా యుద్ధవిమానాల కన్నా భారత ఎఫ్‌జీఎఫ్‌ఏ లతోనే అమెరికా ఎఫ్-22లకు అసలైన సవాలు ఎదురుకాబోతోంది!
ఎఫ్‌జీఎఫ్‌ఏ ప్రత్యేకతలు...
సూపర్‌సోనిక్ వేగం, తక్కువ ఇంధన ఖర్చు.
రాడార్‌క్రాస్ సెక్షన్‌లో సుఖోయ్-30ఎమ్‌కేఐ కన్నా 15-30 రెట్ల ఉత్తమ స్థాయి.
వెనుక వైపుకు కూడా మిస్సైల్స్ సంధించగల సమర్థత
సుదూర ప్రమాదాలను పసిగట్టడం, వాటిని నిర్వీర్యం చేయగలగడం.
ఎఫ్‌జీఎఫ్‌ఏలో ఇద్దరు పైలట్లు ప్రయాణం చేయొచ్చు. 350 మీటర్ల రన్‌వేతో బయలుదేరి 2100-2500 కి.మీ వేగంతో వెళ్లగలదు.

0 comments:
Post a Comment