Monday

కాఫీతో చర్మ కేన్సర్‌కు చెక్...?


కప్పులకు కప్పులు కాఫీ తాగేవారికి చర్మకేన్సర్ వచ్చే అవకాశం తక్కువని వైద్యులు చెబుతున్నారు. ఈ విషయం తమ పరిశోధనలో తేలిందని బోస్టన్‌లోని హార్వర్డ్ మెడికల్ కాలేజీ పరిశోధకులు. వెల్లడించారు. కాఫీ ఎక్కువగా సేవించేవారికి బసల్‌సెల్ కార్సినోమా అనే సాధారణ చర్మ కేన్సర్ వచ్చే అవకాశాలు తక్కువని పరిశోధక బృందానికి నేతృత్వం వహించిన జియాలి హాన్ వెల్లడించారు. అయితే, తమ పరిశోధన ఆధారం చేసుకుని అధికంగా కాఫీ తాగవద్దని హెచ్చరించారు.

తమ పరిశోధనలు ఇంకా ప్రాథమిక స్థాయిలోనే ఉన్నాయని, పూర్తి స్థాయిలో చేపట్టాల్సి ఉందని తెలిపారు.తమ పరిశోధనల్లో భాగంగా సుమారు లక్షమందిని పరిశీలించామని, ఇందులో 23వేలమంది చర్మ కేన్సర్ ఉన్నవారుకూడా ఉన్నారని హాన్ తెలిపారు. గత 20 ఏళ్లుగా వచ్చిన కేసులన్నింటినీ పరిశీలించామని వివరించారు. కాఫీలోని కెఫీన్‌కు చర్మకేన్సర్‌ను నియంత్రించే లక్షణం ఉందన్నారు.

0 comments:

Post a Comment