Monday

రక్తంలోకి డైరెక్ట్‌గా ఆక్సిజన్


క్లిష్టమైన ఆపరేషన్ల సందర్భంగా పేషెంట్లకు అరగంట పాటు శ్వాస అందకున్నా రక్తం ద్వారా ఆక్సిజన్‌ను అందించే ప్రక్రియను సైంటిస్టులు కనుగొన్నారు. బోస్టన్ చ్రిల్డన్ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ జాన్ ఖెయిర్ ఈ వివరాలను వెల్లడించారు. ఒక పేషెంట్ ఊపిరి అందకుండా తన కళ్ల ముందే చ నిపోవడంతో చలించిపోయిన ఆయన ఈ పరిశోధనలను చేపట్టారు. దీనిలో పల్మనరీ వ్యవస్థను బైపాస్ చేసి ఆక్సిజన్‌ను సరాసరి గ్యాస్ రూపంలో రక్తంలోకి ఎక్కిస్తారు.

లిపిడ్లనే కొవ్వు అణువులలోనికి ఆక్సిజన్ అణువులను పంపి, దానిని సరాసరి మానవ రక్తప్రవాహంలోకి పంపుతారు. ఈ ప్రయోగం సందర్భంగా ఆక్సిజన్‌ను ఇంజెక్ట్ చేసినపుడు తమ కళ్ల ముందే రక్తం ఎర్రగా మారిందని ఖెయిర్ వివరించారు. మానవులలో ఈ ప్రయోగం 30 నిమిషాల వర కూ పని చేస్తుందని ఆశిస్తున్నారు.

0 comments:

Post a Comment