గడియారాలు సరిచూసుకోండి. కన్నుమూసి తెరిచేలోగా కరిగిపోయే ఒక చారిత్రక క్షణాన్ని అనుభూతించాలంటే.. రాత్రి పన్నెండు ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూడండి. ఎందుకంటే శనివారం అర్ధరాత్రి కాలానికి ఒక సెకను అదనంగా చేరబోతోంది. మామూలుగా అయితే.. అర్ధరాత్రి 11:59:59 తర్వాత సమయం 12:00:00 అవ్వాలి. కానీ.. శనివారం రాత్రి 11:59:59 తర్వాత 11:59:60 కానుంది! ఆ తర్వాతే పన్నెండో గంట కొడుతుంది!! ఎందుకిలా అంటే దానికో శాస్త్రీయ కారణం ఉంది.
భూమి తనచుట్టూ తాను తిరిగే క్రమంలో.. సూర్యచంద్రుల, సముద్ర కెరటాల ఆకర్షణ శక్తి ప్రభావంతో మనం గుర్తించలేనంత స్వల్పకాలంపాటు.. క్షణంలో కొన్ని వందల కోట్ల వంతు కాలం.. స్థిరమవుతుంది. మనందరం వాడే గడియారాలన్నిటికీ మూలం.. ఇంటర్నేషనల్ ఆటమిక్ టైమ్(టీఏఐ). దీని ఆధారంగానే కో-ఆర్డినేటెడ్ యూనివర్సల్ టైమ్‌ను (యూటీసీ) నిర్ధరిస్తారు. భూభ్రమణంలో కలిగే మార్పు వల్ల టీఏఐ లెక్కల్లోనూ తేడా ఏర్పడుతుంది. ఈ తేడాను సరిచేసేందుకు తరచుగా ఏడాదిలో ఒకరోజుకు ఒక సెకనును అదనంగా కలపడాన్ని 1972 నుంచి ప్రారంభించారు. ఇలా కలిపే అదనపు క్షణాన్ని లీప్ సెకనుగా వ్యవహరిస్తారు.
సాధారణంగా జూన్ 30 లేదా డిసెంబర్ 31నగానీ ఈ అదనపు సెకన్‌ను జోడిస్తారు. అయితే, ఇందుకు నిర్ణీత వ్యవధి అంటూ ఏమీ ఉండదు. భూభ్రమణంలో తేడాలను బట్టి ఎప్పుడు లీప్ సెకన్‌ను కలపాలనే విషయాన్ని "ఇంటర్నేషనల్ ఎర్త్ రొటేషన్ అండ్ రిఫరెన్స్ సిస్టమ్స్ సర్వీస్'' శాస్త్రజ్ఞులు నిర్ణయిస్తారు. 1972లో తొలిసారి ఇలా లీప్ సెకన్‌ను జోడించారు. ఆ ఏడాది రెండుసార్లు (జూన్ 30, డిసెంబర్ 31 తేదీల్లో), తర్వాత ఏడేళ్లపాటు ఏటా ఒక సెకను చొప్పున కలిపారు. అనంతరం.. పద్నాలుగు వేర్వేరు సంవత్సరాల్లో కలిపారు. ఆఖరుసారిగా 2008 డిసెంబరు 31న లీప్ సెకన్‌ను జోడించారు.
నిజానికి ఒక సెకను తేడా అంటే మనకు చాలా చిన్నవిషయంగా అనిపిస్తుందిగానీ.. అత్యంత సునిశితమైన సాంకేతికపరిజ్ఞానం ఆధారంగా పనిచేసే కృత్రిమ ఉపగ్రహాలు, డేటా నెట్‌వర్క్ వంటి వాటికి సంబంధించినంతవరకూ ఇది చాలా కీలకమైన సమయమే. ఈ కారణంగానే.. లీప్ సెకండ్ ఉన్న రోజుల్లో రాకెట్ లాంచింగ్ వంటివాటిని చేపట్టరు.

0 comments:
Post a Comment