Friday

గూగుల్ కళ్లద్దాలు @ 1500 డాలర్లు


సమాచార సేకరణ, మెసేజ్ చూసుకోవడం, ఆన్‌లైన్ వీడియో, ఫొటోలు పోస్ట్ చేయడం, సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లో విహరించడం.. ఏదైనా సరే అన్నింటినీ కళ్లముందుంచడానికి 'గూగుల్ గ్లాసెస్' సిద్ధమయ్యాయి. ఈ ఇంటర్‌నెట్ ఆధారిత కళ్లద్దాలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. వీటి తయారీకి గూగుల్ సంస్థ రెండేళ్లుగా శ్రమిస్తోంది.

అత్యంత గోప్యంగా ఉంచిన ఈ ప్రాజెక్టు ఇప్పుడు ఓ తుది దశకు చేరింది. గత ఏప్రిల్‌లోనే ఈ ప్రాజెక్టు విషయాన్ని వెల్లడించిన గూగుల్.. తన ప్రతిష్ఠాత్మక గ్లాసెస్‌ను మార్కెట్లోకి విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా మొదటగా అమెరికాలోని సాఫ్ట్‌వేర్ నిపుణులకు ఈ అద్దాలను అందించడానికి సిద్ధమైంది.

రూ.84వేలు చెల్లించే వారికి వచ్చే ఏడాది ఆరంభంలో గూగుల్ కళ్లద్దాలు ఇవ్వనుంది. వారి నుంచి సలహాలు, సూచనలు తీసుకుని అత్యాధునిక అద్దాలను మరింత తీర్చిదిద్ది 2014ఆరంభంలో మార్కెట్లోకి విడుదల చేయాలని గూగుల్ భావిస్తోంది.

0 comments:

Post a Comment