Tuesday

“ మీరూ ఆలోచించి చూడండి – జీవాత్మ ”


జీవి ఆత్మ నాలుగు భాగాలుగా వుంటుంది. మరణించిన తరువాత ఒక భాగం ఆత్మీయులతోనే ఉండిపోతుంది; ఒక భాగం చిదాత్మతో సంబంధం పెట్టుకొని వుంటుంది ఎప్పుడైనా వెనక్కి తిరిగి వెళ్ళటానికి. మిగిలిన అర్ధ భాగం పునః జన్మతో జీవాత్మగా రూపొందుతుంది. అర్ధ భాగంతోనే కదా జీవాత్మ మళ్ళీ వచ్చింది. అందుకనే జీవి సంపూర్ణుడు కాడు (దు). మరి అందుకనే, మరొక జీవితో బంధాన్ని కొనసాగిస్తాడు. మరొక జీవి మనిషి కావచ్చు; పశు,పక్ష్యాదులు కావచ్చు; చెట్లు,చేమలు కావచ్చు. గత జన్మ బంధమే జన్మలో బంధానికి దారి తీస్తుంది. ఇది చిన్న ఊహ!!


మీరూ ఆలోచించి చూడండి సూక్ష్మం
సూక్ష్మంలో మోక్ష్మం ( సూక్ష్మంలో మోసం చేసేవారుకూడా వున్నారండోయ్, జాగ్రత్త!! ) అని మనవాళ్ళు అంటుంటారు. సూక్ష్మం అంటే అతి తక్కువ, లేదా అతి చిన్నది, లేదా అతి తేలిక అయినది, లేదా అతి సులభమైనది అని అర్ధం చెప్పుకోవచ్చు. మోక్ష్మం అంటే, అతి పెద్దది, లేదా ఎక్కువ, లేదా అతి కష్టమైనదాని ద్వారా లభించేది అని చెప్పుకుంటాం. సూక్ష్మంలో మోక్ష్మం అంటే, అతి తేలిక, లేదా అతి చిన్న లేదా తేలికైయిన మార్గంద్వారా గొప్పదైన మోక్ష్మాన్ని పొందగలగటం అని అర్ధం. దీని ద్వారా ఆఖరకు మనకు తెలిసివచ్చేదేమిటంటే, అత్యంత ఎక్కువ అయినదాన్ని, అత్యంత తక్కువ అయినదాని ద్వారా; అత్యంత బరువు అయిన దాన్ని, అత్యంత తేలిక అయిన దాని ద్వారా; అత్యంత కష్టమైన దాన్ని, అత్యంత సులభం అయినదాని ద్వారా; అత్యంత పెద్దది అయినదాన్ని, అత్యంత చిన్నది అయినదాని ద్వారా సాధించవచ్చు అని.


పై విషయాన్ని వివరంగా తెలుసుకోవాలంటే, క్రింది ఉదాహరణల్ని గమనించండి:–
విశ్వమంతా అత్యంత చిన్న పరమాణువులనుంచే సృష్టింపబడింది (Big Bang Theory) అని శాస్త్రజ్ఞులు చెబుతారు. – మర్రిచెట్టులాంటి మహావృక్షంకూడా అత్యంత చిన్నదైన, లేదా నలుసంత విత్తనంనుంచే ఆవిర్భవిస్తుంది ఆరడుగుల, అరవై కేజీల మనిషి అత్యంత సూక్ష్మ కణంనుంచే పుడుతున్నాడు నిజానికి, స్థూలంగా, భౌతికరూపంలో జీవి వున్నా, వాస్తవానికి, జీవి ప్రాణం, శక్తి, మనస్సు, బుద్ధి సూక్ష్మ రూపంలోనే వుంటాయికదా! అంతెందుకు, ప్రతి జీవికి సూక్ష్మ శరీరం వుంటుంది కదా! – మరొక విశేష విషయాన్ని గమనించండి చెట్టంత మనిషికి చిన్న చీమ కుట్టినా, కొండంత ఏనుగుకి అంకుశం మొన గ్రుచ్చుకున్నా, నెప్పి అనబడే స్పర్శ అతి సూక్ష్మంగా మనసుకు తెలుస్తుంది చిన్ని,చిన్ని నీటి బిందువులద్వారానే కదా నదులు, సముద్రాలు ఏర్పడుతున్నాయి చంద్రమండలం పైన దిగిన మనిషియొక్క మేధస్సు అంతాకూడా అతి సూక్ష్మాతిసూక్ష్మమైన జీవకణంలోని జీన్స్‍లో ఇమిడి వున్నదిగదా!! – ఒక పేద్ధ గిలక ద్వారా, అతి బరువైన వస్తువును ఎత్తటం కష్టం కానీ, అదే పది చిన్న,చిన్న గిలకలను ( PULLY
SYSTEM) వాడి, తక్కువ శ్రమతో అదే బరువును ఎత్తటం చాలా తేలిక పేద్ద గిన్నడు అన్నం వండినా, అది ఉడికిందో లేదో తెలుసుకోవాలంటే అన్నం అంతా తినక్కరలేదుగదా, మెతుకు తింటే చాలు తెలుస్తుంది సూక్ష్మంగా ఇలా చెప్పాలనుకుంటే, ఎన్నో విషయాలున్నాయి. ఆఖరుగా మరొక ఉదాహరణ:- మీరు కూరనయినా వండుతున్నారనుకోండి. ఉదాకు:- దొండకాయకూర లేదా ఆలూకూర. దొండకాయ అయితే, గుండ్రంగా లేదా పొడుగ్గా; ఆలూ అయితే ఒక అంగుళం సైజు ముక్కలుగా తరిగి, కూర చేస్తారు. సరే రుచిగా వచ్చిందనుకోండి. ఇవే కూరలు ఇంకా బాగా రుచిగా రావాలనుకుంటే ఏంచేయాలో మీకు తెలుసా? బహుశా మీకు తెలిసివుండదు. నేను చెబుతాను వినండి. యా కూరగాయలను అతి చిన్న ముక్కలుగా (కొంచెం శ్రమే అనుకోండి ) తరిగి, మీరు విధంగా వండుతారో అట్లాగే వండండి. సారి కూర రుచి మరింత పెరుగుతుంది. ఎందుకో తెలుసాండీ? ఎప్పుడైతే కూరగాయిల్ని సూక్ష్మమైన ముక్కలుగా తరుగుతారో, ముక్కల్లో దాగివున్న రుచి, సారం పూర్తిగా, త్వరగా బయటకు వచ్చి, కూర రుచిని మరింత పెంచుతుంది. అదే కొంచెం పెద్ద ముక్కలైతే అందులోవున్న సారం పూర్తిగా బయటకు రాదు. ఇది ఇందులోవున్న సూక్ష్మ రహస్యం.


ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, మనం చూసే విషయం; తెలుసుకునే విషయం; చేసే పని; చెప్పే మాట వీటన్నింట్లో సూక్ష్మత దాగివుంటుంది. సూక్ష్మత తత్త్వాన్ని మనం తెలుసుకొని, గ్రహించి, ఆచరణలో పెడితే, ప్రతిదీ సులభతరం, సులభసాధ్యం అవుతుంది.

 ఒక చిన్న ఉదాహరణ:–
నన్ను ఎదుటవాడు, అనవసరంగా, అకారణంగా, అందరి ఎదుట తిడుతున్నాడు. నాకు చాలా కోపం వచ్చింది. అవమానం అనిపించింది. నేనుకూడా మాటామాటా అన్నాను. రచ్చ అయింది. చుట్టూవున్నవాళ్ళు విన్నంతసేపువిని, , ఇద్దరిలో ఏదో తప్పువుండివుంటుంది అని అనుకొని, తలో ఒకమాట అనేసి వెళ్ళిపోయారు. అదే, నేను, నా తప్పేమీలేదు అని తెలుసుకున్నప్పుడు, మాటకుమాట జవాబు ఇవ్వనప్పుడు, ఎదుటవాడు కొంతసేపటికి వెనక్కి తగ్గిపోతాడు. అతని తిట్లను నేను స్వీకరించనప్పుడు, నాకు పోయేదేమీ లేదుకదా! ఇదే ఇందులోవున్న సూక్ష్మం. బుద్ధుడు కూడా ఇదే మనకు బోధించాడు.

ఆస్తిక నమ్మకాలలో ముఖ్యమైనది దైవ విశ్వాసమే కాదు; అంతకంటే కూడా ముఖ్యమైనది జీవాత్మ యెడల నమ్మిక, వేరు వేరు మత సిద్ధాంతాల్లో దైవం యొక్క గుణాలు గురించి వేరువేరుగా వర్ణింపబడడం చేత కొంతమంది దైవ విశ్వాసాన్ని త్రోసిపుచ్చడానికి జంకరు. కాని వారిలో జీవాత్మ ఎడల ఉన్న విశ్వాసం గట్టిగా ఉంటుంది. దైవం గురించి జరిగినన్ని చర్చలు జీవాత్మ గురించి జరగలేదు. అందుచేత జీవాత్మ యెడల నమ్మకం బయలు పడకుండా లోలోన మిగులుతూ వస్తున్నది. ఈ లేఖ అందుకు ఉదాహరణ :
లేఖ :
దేవుడు లేడని మీరు అన్నప్పటికి కొంత అంగీకరించవచ్చు. మీరు చెప్పుచున్న విషయాలు అనుభవానికి సరిపోతున్నవి, దైవం గురించి అప్పుడు నాకు సందేహాలు తీరాయి కాని, ''ఆత్మ'' అనునది
ఉందా లేదా? ''పునర్జన్మ'' ఉన్నదని మీరు అంగీకరిస్తారా? ''ఆత్మ'' అనునది ఉన్నదని భావించినట్లయితే మరణించిన వారి జ్ఞాపకార్థం ఏమి చేయవలెను?
ఈ సందర్భంలో ఆత్మ అను మాటను స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఆత్మ అను మాట ఇంకొక మాటతో చేర్చినచో 'తన' అను అర్థం వస్తుంది. 'ఆత్మ' బంధువులు అనగా తన దగ్గర బంధువులు, ఆత్మీయత అనగా తనకుగల ప్రేమ, ఆత్మవిశ్వాసము అనగా తన శక్తి సామర్థ్యముల యందు తనకుగల నమ్మకము, ఆత్మ విశ్వాసమువలన ధైర్య సాహసములు పెంపొందును.
''ఆత్మ'' అను మాటను ఇంకొక మాటతో చేర్చకుండా ప్రత్యేకముగా వాడినచో ''జీవాత్మ'' లేక జీవుడు అని అర్థం. దేవునివలెనే జీవాత్మ గుణములు కూడా వేరువేరు విధములుగా వర్ణింపబడినవి. హిందువులు, క్రైస్తవులు, మహమ్మదీయులు, బౌద్ధులు జీవాత్మకు వేరువేరు గుణాలను ఆరోపిస్తారు. కాని దేవుని గుణములు వేరువేరుగా వర్ణింపబడిననూ, అది మానవాతీతమయిన శక్తి అని అందరూ ఒప్పుకున్నట్లే , జీవాత్మ అనగా మరణాంతరము ఈ భౌతిక దేహమును విడిపోవునది అని ఆస్తికులందరూ నమ్ముతారు.జీవాత్మ ఉండుట వలన ఈ భౌతిక శరీరమునకు చైతన్యం కలుగుచున్నదనియు, శరీరమును విడిచి జీవాత్మ పోవుటే ఈ శరీరమునకు మరణమనియు ఆస్తికుల విశ్వాసము. అయితే, మనుష్యులవలెనే జంతువులకూ, చెట్లకు కూడా ప్రాణం, చైతన్యం ఉన్నదికదా, జంతువులలోను, చెట్లలోనూ జీవాత్మ ఉన్నదా? ఒక్కొక్క శరీరమునకు ఒక్కొక్క జీవాత్మ ఉన్నదా? లేక చాలా జీవాత్మలున్నవా? గులాబీమొక్క, ఒబీలియావంటి జంతువులను ముక్క ముక్కలుగా తృంచివేస్తే, ఒక్కొక్క ముక్క మళ్లా ఒక్కొక్క గులాబీ మొక్కగానూ, ఒబీలియా జంతువుగాను ఎదుగుతున్నాయని మనం చూస్తున్నాము గదా. అప్పుడు తల్లిలోని జీవాత్మ విభజింపబడుతుందా? మన శరీరములోనే రక్తములో భాగములగు తెల్లకణములు ప్రత్యేక చైతన్యముతో వ్యవహరిస్తూ ఉంటాయి కదా. మన శరీరం జీవాత్మ వేరు, వాటి జీవాత్మవేరునా ! ఎలక్ట్రిక్‌ తీగ తాకుటచేతనో, నీటిలో మునిగిపోవుటచేతనో మరణించారనుకునే వారికి ఉచ్ఛ్వాస ప్రక్రియలు చేయుటచేత వారు బ్రతుకుతున్నారే; ముందు పోయిన జీవుడు మళ్ళా శరీరములోనికి వస్తున్నదా, లేక మరణించారనుకున్న తర్వాతకూడా చైతన్య రహితమైన శరీరములో జీవాత్మ ఇంక ఉందా? అట్లు ఎంతసేపు ఉంటుంది? ఒకే పిండం ఉత్పత్తి దశలలో విభజింపబడి కవలలుగా ఎదుగుచుండుట మనకు తెలుసునుకదా; అప్పుడు పిండము లోని జీవాత్మ విభజింపబడుతుందా? శుక్లము, అండం, ప్రత్యేక చైతన్యముతో వ్యవహరిస్తాయే, వాటికి వేరువేరు జీవాత్మలు ఉన్నాయా? అవి సంయోగం వలన కలసి ఒకే పిండం అయినప్పుడు వాటి వేరు వేరు జీవాత్మలు కలసిపోతాయా?
జీవాత్మ ఉందనుకుంటే ఇటువంటి చిక్కు ప్రశ్నలు ఎన్నో వస్తున్నాయి. మరియు జీవాత్మ కలదని నిరూపించుటకు ఒక ప్రత్యక్ష నిదర్శనము కూడా లేదు. మన భీతివలన దయ్యములు అను భ్రాంతి కలుగుచున్నదే కాని దయ్యములు అబద్ధమనుట ఇప్పుడు తెలిసిన విషయమే. వీటివలన ''ఆత్మ'' లేదు అని చెప్పగలం. దేవునివలెనే ఆత్మ అనునది కూడా ఒక అబద్ధము. విశ్వములోని విషయములను తెలుసుకొనుటకై, ''దైవసృష్టి'' అను అతి సులభమైన అబద్ధపు మార్గమును అనుసరించినట్లే, మరణమునకు అర్థము తెలుసుకొనుటకై ''ఆత్మ'' అనుదానిని పూర్వీకులు కల్పించుకున్నారు. అది ఒక నమ్మకముగా సమాజములో వ్యాపించి ఉన్నది, కాని దానిని సత్యదృష్టితో పరిశీలించినచో ''దైవం'' వలెనే ఆత్మకూడా అబద్ధం అని తేలుతుంది.
'ఆత్మ' లేనప్పుడు పునర్జన్మ, జన్మరాహిత్యము, స్వర్గసంపాదన, మోక్షము మొదలగు భావములు కూడా 'ఆత్మ' వంటి ఊహాకల్పితాలే. మరియు పునర్జన్మ అను నమ్మకము ఒక హిందువులలోనే ఉంది. కాని, మహమ్మదీయులలోను, క్రైస్తవులలోను లేదు. పునర్జన్మ నిజమయితే, పట్టుకుంటే నిప్పు అందరికీ చురికినట్లు పునర్జన్మ అందరికి ఉండవలెను. కాని కొందరికి ఉండి కొందరికి లేకుండా పోదు. ఈనాడు హిందువుగా ఉంటే పునర్జన్మ ఉండి రేపు మహ్మదీయుడో, క్రైస్తవుడో అయితే పునర్జన్మపోదు. అలాగే అటునుండి ఇటు కూడాను.
మరణించిన వారి ఆత్మశాంతికై జరుపు ఆబ్దికములు మూఢాచారములు, ఒకవేళ పునర్జన్మల్ని నమ్మిననూ, మరణించిన తల్లిదండ్రుల ఆత్మలు ఎక్కడో పునర్జన్మ ఎత్తి ఉన్నట్లయితే వారి ఆత్మశాంతికై ఈ ఆబ్దికములు అనవసరమగుచున్నవిగదా! అట్లు పునర్జన్మ ఎత్తలేదని వీరికి నిదర్శనం ఏది? అందుచేత ఆబ్దికము అనగా తల్లిదండ్రుల జ్ఞాపకార్థం సంవత్సరం చేయు విషయమంటే కొంత అర్థమున్నది. కాని అది మరణించిన తల్లిదండ్రుల ఆత్మశాంతి కొరకు అనుట అర్థరహితము.
మరణించిన తల్లిదండ్రుల జ్ఞాపకార్థము జరుపు సందర్భములను ఆత్మశాంతి అను మూఢనమ్మకాలతో జోడించుట చేత తల్లిదండ్రుల యెడల ఉండవలసిన గౌరవము మరుగున పడిపోయి, మూఢాచార లాంఛనములు పెరిగిపోవుచున్నవి. అందుచేత ఆబ్దికములను విడిచిపెట్టవలెను. మరణించిన తల్లిదండ్రులలోని సుగుణములను, వారి ఆశయములను పిల్లలు ఆచరించుచు, కొనసాగించుటకంటే మించిన జ్ఞాపక చిహ్నం లేదు. తమ ఆచరణకు తోడుగా వారి జీవిత సంగ్రహములను ప్రచురించి, ప్రచారము లోనికి తీసుకురావచ్చు. ఆ తల్లిదండ్రుల జీవితములు ఎంతవరకు సంఘ ప్రయోజనకరంగా ఉండినవో దాని మీద ఈ ప్రచారబలం ఆధారపడి ఉంటుంది.
ఆత్మశాంతికై ఆబ్దికములు ఎంత మూఢాచారములో 'నపుత్రశ్య గతిన్నాస్తి' అని ఇతరులను పెంపకమునకు తీసుకొనుట కూడా అంతే మూఢనమ్మకము. వ్యక్తిగత ఆస్తులు ఉన్న రోజులలో వారసత్వ హక్కులను పదిలపర్చుకొనుటకై పెంపకములు జరగవచ్చును. కాని పెంపకములకంటే తమ ఆస్తులను సంఘ ప్రయోజన కార్యక్రమములకు సహాయముగా ఇచ్చివేయుట మంచిది. ఇట్లే ఆబ్దికములు, అంత్యక్రియలు వంటి మూఢాచార లాంఛనములతో వృధాపరచుటకంటే తల్లిదండ్రుల జ్ఞాపకార్థము తమ శక్తి సామర్థ్యములను ఆస్తి అవకాశములను సంఘ ప్రయోజనకర కార్యక్రమములకై వినియోగించుట మంచిది. 

0 comments:

Post a Comment