Thursday

లాడెన్ పట్టివేతలో అమెరికాకు సహకారం


 ఒసామా బిన్‌లాడెన్‌ను గుర్తించడంలో అమెరికాకు సహకరించిన పాక్ వైద్యుడికి 33 ఏళ్ల జైలు శిక్ష పడింది. పాకిస్థాన్‌లోని గిరిజన చట్టాల మేరకు ఈ శిక్షను విధించారు. అమెరికా దాడిలో చనిపోయింది లాడెనా కాదా అని నిర్ధారించడానికి షకీల్ అహ్మద్ అనే వైద్యుడు సహకరించారన్నది ప్రధాన అభియోగం. అబోత్తాబాద్‌లో సీఐఏ నిర్వహించిన నకిలీ వ్యాక్సిన్ కార్యక్రమానికి షకీల్ సహకరించారని ఆరోపణలు వచ్చాయి. 

లాడెన్ కుటుంబ సభ్యుల డీఎన్ఏను సేకరించడానికి ఈకార్యక్రమాన్ని తలపెట్టినట్లు తెలిసింది. దీంతో అమెరికా సైనికుల దాడి ఘటనను విచారిస్తున్న హైకమిషన్ షకీల్‌ను తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది. అధికారిక వర్గాల సమాచారం మేరకు షకీల్‌కు 33ఏళ్ల జైలు శిక్ష విధించారు. అమెరికాకు సహకరించినందుకు షకీల్‌ను ఇప్పటికే పాక్ ప్రభుత్వం విధులనుంచి తప్పించిన విషయం తెలిసిందే. ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న అమెరికా, పాకిస్థాన్ సంబంధాలు తాజా ఘటనతో మరింత దిగజారే అవకాశం ఉంది.

0 comments:

Post a Comment