Monday

లతాజీ... లాంగ్ లివ్...!


 గత రెండు రోజుల పాటు ఓ వదంతి ముంబయ్ నగరంతో బాటు దేశ విదేశాల్లోని సంగీత అభిమానుల్ని కుదిపేసింది. గానకోకిల లతామంగేష్కర్ కన్నుమూసిందంటూ వచ్చిన ఆ వదంతి లతా సన్నిహితుల్ని ఆందోళనలో ముంచేసింది. మొన్న రాత్రల్లా ఆమె ఇంటిలోని ల్యాండ్ లైన్ టెలిఫోన్ మోగుతూనే వుంది. ఆ కాల్స్ అన్నిటినీ లతాజీ సోదరి ఉషా, ఆమె మేనకోడలు రచన రిసీవ్ చేసుకుని, లతాజీ బాగానే ఉన్నారనీ, అది ఒట్టి వదంతి మాత్రమే అనీ, విసుగు విరామం లేకుండా ప్రతి ఒక్కరికీ జవాబు చెప్పారు. ఇక లతాజీ పర్శనల్ మొబైల్ కి కూడా ఎన్నో కాల్స్... మొదటి కాల్ సంజయ్ దత్ నుంచి వచ్చిందట!
       "నా పర్శనల్ నెంబర్ ఎక్కువ మందికి తెలియదు కాబట్టి బతికిపోయాను. నాకు బాగా  సన్నిహితులనుకున్న వాళ్లకే ఆ నెంబర్ తెలుసు. అయినా, ఇలాంటి రూమర్లు ఎవరు పుట్టిసారో... వీటి నుంచి వాళ్లు ఏం బావుకుంటారో తెలియదు. అయితే, ఆ వదంతుల వల్ల బాధితులు ఎంత క్షోభ అనుభవిస్తారో తెలుసా? మా తమ్ముడు హృదయనాథ్ నాగపూర్ కి దగ్గరలోని శివార్లలో ఉంటాడు. అక్కడికి మొబైల్ నెట్ వర్క్ లేదు. ఈ వార్త తెలిసి వాడు పడ్డా బాధ అంతా ఇంతా కాదు. చివరికి ఎలాగో వాడిని పట్టుకుని, స్వయంగా నేను మాట్లాడే వరకు వాడికి కుదురు లేదు. ఇదేమిటి చెప్పండి? ఇంతకు ముందు దిలీప్ కుమార్జీ, అమితాబ్జీ విషయంలో కూడా ఇలాగే జరిగింది. ఏమైనా, ఈ వదంతి సృష్టించిన వ్యక్తిని భగవంతుడు దయతో చూడు గాక!" అంటూ లతాజీ ఆ రూమర్ సృష్టికర్తను దీవించింది.
       అసలు ఇలాంటి వదంతుల వల్ల కీడు పోయి, వాళ్ళ ఆయుర్దాయం పెరుగుతుందంటారు... మన గానకోకిల విషయంలో కూడా ఇది నిజమవ్వాలి!

0 comments:

Post a Comment