అన్నదమ్ములంతా ఆర్టిస్టులైతే ఓ ప్రయోజనం వుంది. అవసరమైనప్పుడు ఒకళ్లని మరొకళ్లు ఎంకరేజ్ చేసుకోవడానికి... ఒకరి సినిమాలలో మరొకళ్లు గెస్ట్ రోల్స్ వేయచ్చు. చిరంజీవి కుటుంబంలో కూడా ఈ ఆనవాయతీ వుంది. గతంలో చిరంజీవి నటించిన 'శంకర్ దాదా ఎమ్బీబీఎస్', 'శంకర్ దాదా జిందాబాద్' సినిమాలలో అన్నయ్యతో కలిసి పవన్ కల్యాణ్ అతిధి పాత్రల్లో నటించాడు. ఆ తర్వాత చిరంజీవి తన తనయుడు రామ్ చరణ్ నటించిన 'మగధీర' సినిమాలో గెస్ట్ రోల్ పోషించారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ నటిస్తున్న 'గబ్బర్ సింగ్' సినిమాలో తమ్ముడితో కలిసి చిరంజీవి అతిధి పాత్రలో నటిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. పవన్ తో కలిసి ఓ పాటలో ఆయన స్టెప్పులేస్తారని అంటున్నారు. అందు కోసం దేవిశ్రీ ప్రసాద్ మంచి బీట్ తో పాట కూడా రెడీ చేశాడట. 'గబ్బర్ సింగ్' సినిమాకు మార్కెట్ పరంగా మరింత క్రేజ్ తీసుకురావడానికి దర్శక నిర్మాతలు ఈ ప్లాన్ వేశారట. ఇదే నిజమైతే కనుక మెగా అభిమానులకు ఇక పండగే కదా!
0 comments:
Post a Comment