Monday

ఆకర్షించే అందగత్తెలు ఎవరు...?


ఐస్కాంతానికన్నా ఎక్కువ ఆకర్షణ శక్తి  అందానికే వుందనేది అందరికీ తెలిసిన నిజం. అయితే తమ అందచందాలతో చూపుల్ని కట్టిపడేసే చక్కని చుక్కలు ఎవరనే ప్రశ్న అందరిలోనూ ఆసక్తిని రేకేత్తిస్తుంటుంది. ఈ విషయమై ఓ జాతీయ దిన పత్రిక ఇటీవల దేశ వ్యాప్తంగా ఓ సర్వే ని నిర్వహించింది. 2011 లో అత్యంత ఆకర్షణీయమైన మహిళ ఎవరు? అనే సర్వే ని జరిపింది. ఈ ఆన్ లైన్ పోల్ కి అనూహ్యమైన రీతిలో స్పందన లభించింది. దేశవ్యాప్తంగా జరిగిన ఈ సర్వే కి దాదాపు 3 .74 లక్షల ఓట్లు పోలయ్యాయి. ఈ పోలింగ్ ప్రకారం మొదటి 20 స్థానాలను గెలుచుకున్న వారి జాబితాను ప్రకటించడం జరిగింది.
    దాని ప్రకారం...మొదటి స్థానంలో కరీనాకపూర్, రెండవ స్థానంలో కత్రినా కైఫ్, మూడో స్థానంలో దీపిక పదుకొనే, నాల్గో స్థానంలో ప్రియాంక చోప్రా, ఐదో స్థానంలో అనుష్కా శర్మ నిలిచారు. అయితే ఈ జాబితాలో ఐశ్వర్య రాయ్ పదో స్థానానికి పడిపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇక ఈ జాబితాలో దక్షణాది తారలు సైతం తమ ఉనికిని చాటుకున్నారు. పన్నెండో స్థానాన్ని జెనీలియా, పదిహేనో స్థానాన్ని శ్రియ ఆక్రమించగా చివరి ఐదు స్థానాల్లో శృతి హాసన్, ఆశిన్, ఎమీ జాక్సన్, త్రిష, ఇలియానా నిలిచారు.   

0 comments:

Post a Comment