సంగీత దర్శకుడు తమన్ త్వరలో బ్రెజిల్ వెళుతున్నాడు. హాలిడే కోసం కాదులెండి... కొత్త ట్యూన్లు కంపోజ్ చేయడానికి బ్రెజిల్ లోని సుందర నగరం రియో ప్రయాణమవుతున్నాడు. తమన్ ఇటీవల రెండు పెద్ద ప్రాజక్టులు సైన్ చేశాడు. వాటిలో ఒకటి యన్టీఆర్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందే సినిమా కాగా, ఇంకొకటి రామ్ చరణ్ హీరోగా వీవీ వినాయక్ దర్శకత్వంలో రూపొందే సినిమా. వీటి కోసం ఇప్పటికే పని మొదలెట్టాడు. త్వరలో రియో వెళ్లి అక్కడ ఒక్కో చిత్రానికి కనీసం రెండేసి ట్యూన్లు కంపోజ్ చేసుకుని రావాలని ప్లాన్ చేసుకుంటున్నాడట. యన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ మాస్ ఇమేజ్ వున్నా పెద్ద స్టార్స్ కాబట్టి, ఈ సినిమాలు తన సత్తా చూపించాలని మనవాడు మంచి పట్టుదలతో ఉన్నాడని అతని సన్నిహితులు చెబుతున్నారు.
0 comments:
Post a Comment