Friday

ఇలియానాపై నిర్మాత కంప్లైంట్



ఎందుకో నిర్మాతలకి, గోవా బ్యూటీ ఇలియానాకు మొదటి నుంచీ క్లాష్ నడుస్తోంది. గత సంవత్సరం 'శక్తి' సినిమా విడుదల సమయంలో ప్రమోషన్ కార్యకలాపాలలో ఆమె సహకరించడం లేదంటూ నిర్మాత అశ్వనీదత్, ఆమె మీద నిర్మాతల మండలికి ఫిర్యాదు చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇప్పుడు మళ్లీ మరో నిర్మాత ఆమె మీద కంప్లైంట్ చేశాడు. తాను నిర్మించిన 'దైవ తిరుమగళ్' (తెలుగులో నాన్న) సినిమాకు ముందుగా ఇలియానాను బుక్ చేసి, ఆమెకు 40 లక్షల అడ్వాన్స్ ఇచ్చాననీ, తర్వాత కొన్ని కారణాల వల్ల ఆమెను డ్రాప్ చేసుకుని అనుష్కను తీసుకున్నాననీ, తన అడ్వాన్స్ మాత్రం ఇలియానా తిరిగి ఇవ్వడం లేదనీ తమిళ చిత్ర నిర్మాత మోహన్ నటరాజన్ తమిళ నిర్మాతల మండలిలో తాజాగా ఫిర్యాదు చేశాడు.
       'మీ వల్ల నా డేట్స్ వృథా అయ్యాయనీ, అందుకని అడ్వాన్స్ తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదనీ' ఆమె చెబుతోందని సదరు నిర్మాత కంప్లైంట్ లో పేర్కొన్నాడు. అయితే, ఆమె ఒక్క రోజు కూడా షూటింగులో పాల్గొనలేదనీ, కనీసం ఫోటో సెషన్ కూడా చేయలేదనీ, అలాంటప్పుడు డేట్స్ వృథా అవ్వడం అన్న సమస్యే ఉత్పన్నం కాదని నిర్మాత వాదిస్తున్నాడు. అందుకని తన 40 లక్షలూ తనకు ఇప్పించమనీ ఆయన కోరుతున్నాడు. మరి, నిర్మాతల మండలి ఏం చేస్తుందో చూద్దాం! 

0 comments:

Post a Comment