Monday

ఉద్యోగులను తొలగించం యునినార్...!


122 కొత్త టెలి కాం లైసెన్స్‌లను రద్దు చేస్తూ గత వారం సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో.. ఇప్పటికిప్పుడు తమ మొబైల్ ఫోన్ సర్వీసులు నిలిచిపోలేదని, ఇలాంటి పరిస్థితిలో తమ ఉద్యోగులను తొలగించే అవకాశం గానీ వేతనాలు తగ్గించే ప్రసక్తిగానీ లేదని యునినార్ వెల్లడించింది. అన్ని మార్కెట్లలో కూడా తమ సర్వీసులు యధావిధిగా కొనసాగుతున్నాయని యునినార్ ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు.

0 comments:

Post a Comment