Saturday

కారును వేగంగా నడిపినందుకు మంత్రి పదవికి రాజీనామా బ్రిటన్లో సీనియర్ మంత్రి క్రిస్ హుహ్నే ఔట్


కారును వేగంగా నడిపి చట్టాన్ని ఉల్లంఘించిన నేరానికి బ్రిటన్ విద్యుత్తు శాఖ మంత్రి క్రిస్ హుహ్నే తన పదవికి రాజీనామా చేశారు. బ్రిటన్ సంకీర్ణ సర్కారులో హుహ్నే సీనియర్ మంత్రి. అయితే, 2003మార్చి 12న స్టాన్‌స్టెడ్ విమానాశ్రయం నుంచి ఎస్సెక్స్‌లోని తన నివాసానికి తిరిగి వస్తున్న సమయంలో ఆయన కారును పరిమితికి మించి వేగంగా నడిపారు.

గతంలో చేసిన నేరాల కుగానుఇప్పటికే ఆయన డ్రైవింగ్ లైసెన్స్‌పై పెనాల్టీ పాయింట్లు ఉన్నా యి. తాజా నేరానికి మరిన్ని పెనాల్టీ పాయింట్లు జతకూడితే ఆయన లైసెన్స్‌ను రద్దుచేసే అవకాశంఉంది. దీనికితోడు, కారును వేగంగా న డిపి చట్ట ఉల్లంఘనకుపాల్పడ్డారంటూ పోలీసులు కేసు నమోదు చే యడంతో శుక్రవారం ఆయన తన మంత్రిపదవికి రాజీనామా చేశారు.

0 comments:

Post a Comment