Tuesday

ఏకాగ్రత పెంచే అర్ధమత్సేంద్రాసనం

అర్ధమత్స్యేంవూదాసనం
హఠయోగలోని పన్నెండు ప్రాథమిక ఆసనాలలో తొమ్మిదవది అర్ధమత్స్యేంవూదాసనం. దీనివలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. వెన్నెముక మొత్తాన్ని పార్శ్వంగా రెండువైపులా మలుపులు తిప్పేది ఈ ఆసనం. నాడీ వ్యవస్థకు సంబంధించిన సమస్యలను పూర్తిగా నివారిస్తుంది.

పద్ధతి :


ముందుగా సుఖాసనంలో కూర్చోవాలి. రెండు కాళ్లనూ ముందుకు చాపాలి. ఎడమకాలిని మడిచి కుడికాలి మడమను ఎడమ తొడభాగానికి పక్కగా వచ్చేట్టుగా ఉంచాలి. ఎడమ కాలిని కుడికాలు మోకాలు మీదుగా తీసుకెళ్లి కుడివైపు పెట్టాలి. ఇప్పుడు కుడిచేతిలో ఎడమకాలి మడమను పట్టుకోవాలి. ఎడమ చేతిని వెన్నెముక కిందుగా వచ్చేట్లుగా వెనుక వైపున ఉంచాలి. ఇప్పుడు నెమ్మదిగా గాలి పీల్చుకుని, గాలి వదులుతూ ఎడమవైపుగా తలను, భుజాలను, నడుమును తిప్పి, భుజాల మీదుగా వెనుకకు చూడాలి. 5 నుంచి 6 సెకెన్లపాటు ఉండి, నెమ్మదిగా గాలిపీలుస్తూ ముందుకు రావాలి. ఇలా ఐదు సార్లు రిపీట్ చేయాలి. ఇదేవిధంగా కుడివైపు కూడా చేయాలి.

అర్ధమత్స్యేంవూదాసనం వేరియేషన్ 
ముందుగా సుఖాసనంలో కూర్చోవాలి. రెండు కాళ్లనూ ముందుకు చాపాలి. ఎడమకాలిని మడిచి కుడికాలి మడమను ఎడమ తొడభాగానికి పక్కగా వచ్చేట్టుగా ఉంచాలి. ఎడమ కాలిని కుడికాలు మోకాలు మీదుగా తీసుె ళ్లి కుడివైపు పెట్టాలి. ఇప్పుడు కుడిచేతిలో ఎడమకాలి మడమను పట్టుకోవాలి. ఎడమ చేతిని వెన్నెముక కిందుగా వచ్చేట్లుగా వెనుక వైపున ఉంచాలి. ఇప్పుడు నెమ్మదిగా గాలి పీల్చుకుని గాలి వదులుతూ ఎడమవైపుగా తలను, భుజాలను, నడుమును తిప్పి, భుజాల మీదుగా వెనుకకు చూడాలి. ఆసన స్థితిలో ఎప్పుడయితే సౌకర్యంగా ఉండగలుగుతున్నామో అప్పుడు వెనుకగా ఉన్న చేతిని నడుము చుట్టూ ఉంచాలి. 5 నుంచి 6 సెకెన్లపాటు ఉండి, నెమ్మదిగా గాలిపీలుస్తూ ముందుకు రావాలి. ఇలా ఐదు సార్లు రిపీట్ చేయాలి. ఇదేవిధంగా కుడివైపు కూడా చేయాలి.
ఉపయోగాలు :
- నాడీవ్యవస్థను ఉత్తేజితం చేస్తుంది.
- వెన్నెముకను దృఢపరుస్తుంది.
- డయాబెటిస్ ఉన్నవారు రెగ్యులర్‌గా దీనిని సాధన చేసినట్లయితే క్లోమం పనితీరు సక్రమ మవుతుంది. వ్యాధి కంట్రోల్‌లో ఉంటుంది.
- కాలేయం, క్లోమం, మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది.
- ఉదర కండరాలను శక్తివంతం చేస్తుంది.
జాగ్రత్తలు :
- సయాటికా, స్లిప్‌డిస్క్ ఉన్నవారు నిపుణుల ఆధ్వర్యంలో మాత్రమే చేయాలి.
- హెర్నియా, పెప్టిక్ అల్సర్ ఉన్నవారు చెయ్యకూడదు.
వక్రాసనం
అర్ధ మత్స్యేంవూదాసనం కంటే ముం దుగా ఈ వక్రాసనము ప్రయత్నించవచ్చు. ఇది సులభమైనది.
పద్ధతి :
ముందుగా సుఖాసనం లో కూర్చోవాలి. ఇప్పుడ రెండుకాళ్లు ముందుకు చాచాలి. ఎడమకాలిని మొకాలివద్ద మడిచి కుడికాలు మోకాలు పక్కగా ఉంచాలి. ఇప్పుడు కుడిచేతితో ఎడమకాలి మడమను పట్టుకోవాలి. ఎడమచేతిని శరీరం వెనుకగా వెన్నెముక కిందుగా ఉంచాలి. ఇప్పుడు గాలి దీర్ఘంగా పీల్చి వదులుతూ తలను, భుజాలను ఎడమపక్కకు తిప్పాలి. భుజాల మీదుగా వెనుకకు చూడాలి. కొన్ని సెకన్లు ఈ స్థితిలో ఉండి తిరిగి గాలి పీలుస్తూ ముందుకురావాలి. ఇలా మూడు సార్లు చేయాలి. ఇదేవిధంగా కుడికాలితో కూడా చేయాలి.
ఉపయోగాలు :
- వక్రాసనం వెన్నెముకలో ఫ్లెక్సిబిలిటీని పెంచి, వెన్నెముకను దృఢపరుస్తుంది.
- ఏకాక్షిగతను, విల్‌పవర్‌ను పెంచుతుంది.
- వెనుకకు తిరిగి ఆగినప్పుడు ఏర్పడే కంప్రెషన్ వల్ల ఉదరములోని అన్ని భాగాలకు మంచి మసాజ్ లభిస్తుంది. రక్తవూపసరణ మెరుగుపడుతుంది.
- స్టిఫ్‌నెక్, స్ట్రెస్ వల్ల కలిగే వీపునొప్పిని తగ్గిస్తుంది.
- ఎక్కువ సమయం కూర్చునే ఉద్యోగాలలో ఉన్నవారికి ఇది చాలా మంచిది.
జాగ్రత్తలు :
- తీవ్రమైన వెన్నునొప్పి సమస్యలు ఉన్నవారు, అల్సర్, హెర్నియా ఉన్నవారు చేయకూడదు. 

0 comments:

Post a Comment