Monday

తిరుమల అంటేనే దడ! కాలు పెడితే స్వామి శపిస్తాడని కన్నడిగుల భయం బాగల్కోట్ ప్రాంత ప్రజల్లో వింత నమ్మకం


తిరుమల వెంకన్న దర్శనం భక్తులకు దన్ను. స్వామి కొలువైన కొండెక్కితే కొండంత ధైర్యం. కానీ, కర్ణాటకలోని ఓ గ్రామానికి మాత్రం తిరుమలపై కాలు పెట్టాలంటేనే దడ. అందర్నీ తన దగ్గరకు రప్పించుకునే వేంకటేశుడు.. బాగల్కోట్ జిల్లా గొరజనాళ గ్రామస్తులను మాత్రం " ఆ దరిదాపులకు రావొద్ద''ని శాసించాడట. కాదని ఎవరైనా సాహసిస్తే శపించేస్తానని ఓ గ్రామస్తుడి కలలో కనిపించి హెచ్చరించాడట. ఈ కారణంగా శతాబ్దాలుగా తాము తిరుమల ముఖమే ఎరుగమని గొరజనాళ వాసులు చెబుతున్నారు.

నిజంగానే, గ్రామానికి చెందిన బ్రాహ్మణులు తప్ప వేరే కులాల వాళ్లెవరూ తిరుమల వచ్చిన దాఖలా లేదు. అన్యులెవరైనా వెళ్లేందుకు ప్రయత్నిస్తే జబ్బుపడి చనిపోతున్నారట. దీంతో.. గ్రామంలోనే గుడి కట్టుకొని వేంకటేశుడికి మొక్కులు చెల్లించుకోని, అక్కడే తలనీలాలు ఇస్తున్నారు. తరతరాలుగా ఈ ఆచారం కొనసాగుతోందని గ్రామపెద్ద పచ్చయ్యరెడ్డి చెబుతుండగా, ఇదో తరహా మూఢనమ్మకమని జ్యోతిష్కులు వాదిస్తున్నారు. కాకపోతే, వేంకటేశ్వర స్వామిని రెడ్డి కులస్థుడిగా భావించే ఒక వర్గం, తిరుమలకు దూరంగా ఉండి ఉండొచ్చని కొందరు అర్చకులు అభిప్రాయపడుతున్నారు.

0 comments:

Post a Comment